ఫేస్ మాస్క్(Face Mask) కరోనా వైరస్ నుంచి కాపాడుతుందా? సైన్స్ ఏం చెబుతుంది

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. కరోనా గజగజలాడిస్తోంది. 160 దేశాలకు విస్తరించిన కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చాప కింద నీరులు

  • Published By: veegamteam ,Published On : March 18, 2020 / 05:34 AM IST
ఫేస్ మాస్క్(Face Mask) కరోనా వైరస్ నుంచి కాపాడుతుందా? సైన్స్ ఏం చెబుతుంది

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. కరోనా గజగజలాడిస్తోంది. 160 దేశాలకు విస్తరించిన కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చాప కింద నీరులు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. కరోనా గజగజలాడిస్తోంది. 160 దేశాలకు విస్తరించిన కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చాప కింద నీరులు వ్యాపిస్తున్న కరోనా మనుషుల ప్రాణాలు తీస్తోంది. ఇప్పటివరకు దాదాపు 2లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 7వేల 500 మంది చనిపోయారు. కొందరి పరిస్థితి సీరియస్ గా ఉంది. ఇప్పటివరకు కరోనాకి వ్యాక్సిన్ కానీ మందు కానీ కనిపెట్టలేదు. దీంతో అంతా భయం భయంగా బతుకుతున్నారు. ముందు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అలా పాటిస్తున్న జాగ్రత్తల్లో ప్రధానమైనది మాస్క్. శానిటైజర్లు యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ వాడుతున్నా మనసులో భయాలు మాత్రం అలానే ఉన్నాయి. 

కాగా, ఫేస్ మాస్క్(ముసుగు) ఎంతవరకు సేఫ్? మాస్క్, కరోనా నుంచి కాపాడుతుందా? మాస్క్ వేసుకుంటే కరోనా రాదా? ఇప్పుడీ ప్రశ్నలు మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మారాయి. దీనిపై నిపుణులు స్పందించారు. మాస్క్ ధరిస్తే కరోనా సోకదని కచ్చితంగా చెప్పలేము అంటున్నారు. అలాంటి గ్యారంటీ ఏదీ లేదన్నారు. కరోనా వైరస్.. కళ్ల ద్వారా కూడా వ్యాపిస్తుందని చెప్పారు. వైరస్ ఏరోసోల్స్(చిన్న చిన్న వైరల్ కణాలు) మాస్క్ లో నుంచి చొచ్చుకుపోగలవన్నారు. కరోనా వైరస్ ప్రధాన ప్రసార మార్గమైన బిందువులను సంగ్రహించడంలో ముసుగులు(మాస్క్) ప్రభావవంతంగా ఉంటాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

అదే సమయంలో మాస్కుల వల్ల నష్టం కన్నా లాభమే ఎక్కువని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వైరస్ సోకిన వారితో సన్నిహితంగా ఉండే సందర్భంలో.. వైరస్ అటాక్ అయ్యే అవకాశాన్ని మాస్క్ తగ్గిస్తుందన్నారు. కరోనా వైరస్ లక్షణాలు కలిగున్నా, వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయినా.. బాధితుడు మాస్క్ ధరించడం ద్వారా ఇతరులను కాపాడినట్టు అవుతుందని చెబుతున్నారు. వైరస్ బారిన పడ్డ రోగులకు ట్రీట్ మెంట్ చేసే డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బందికి మాస్క్ చాలా ముఖ్యమైనదని స్పష్టం చేశారు. అలాగే ఇంట్లో క్వారంటైన్ లో ఉన్న పేషెంట్ కు సమీపంలో ఉండే కుటుంబ సభ్యులకు మాస్క్ లు రక్షణగా ఉంటాయంటున్నారు.

See Also | కరోనా భయం, స్వీయ నిర్భందంలో మాజీ కేంద్రమంత్రి