పెంపుడు జంతువులకు వైరస్ సంక్రమిస్తుందా?

  • Published By: veegamteam ,Published On : March 23, 2020 / 09:03 AM IST
పెంపుడు జంతువులకు వైరస్ సంక్రమిస్తుందా?

హాంగ్ కాంగ్ లో రెండేళ్ల జర్మన్ షెపర్డ్, 17 ఏళ్ల పోమెరేనియన్ కుక్కుల పై కరోనా వైరస్ టెస్టు చేశారు. ఆ టెస్టులో వాటికి తక్కువ మోతాదులో పాజిటివ్ అని తేలింది. వాటిని నిర్భంధంలో ఉంచి ట్రీట్ చేశారు. బైటకొచ్చిన రెండు రోజులకే చనిపోయాయి. వాటి యజమానులకు కూడా కరోనా వైరస్ టెస్టు చేస్తే పాజిటివ్. కరోనాలోతేనే ఈ డాగ్స్ చనిపోయాయా? ఒత్తిడే కారణం కావచ్చన్నది నిపుణుల మాట.

కరోనా వైరస్ మనుషుల నుండి కుక్కలకు వ్యాపిస్తుందని చెప్పటానికిదో ఉదాహరణ. అలాగని పెట్స్ నుంచి మనకు వైరస్ వ్యాపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. The World Organisation for Animal Health ప్రకారం , us center for disease control and prevention, వెట్ డయాగ్నొస్టిక్ కంపెనీ  ఐడిఎక్స్ఎక్స్ పెంపుడు జంతువుల నుండి మనకు కోవిడ్ -19 సంక్రమిస్తుందా అన్నదానిపై వేలాది డాగ్స్, కేట్స్ మీద పరిశోధనలు చేసింది. పెంపుడు జంతువుల నుండి కోవిడ్ 19 సంక్రమిస్తుందని స్టడీ నిర్ధారించలేదు. అంటే కరోనా డాగ్స్ నుంచి మనుషులకు సంక్రమించదు.

హాంగ్ కాంగ్ జంతు-సంక్షేమ ఆథారిటీ, పెంపుడు జంతువుల యజమానులకు కొన్ని సూచనలు చేసింది.  వారిని పరిశుభ్రత  పద్ధతులను పాటించమని గుర్తు చేసింది. ముద్దు వచ్చిందికదాని ముద్దు పెట్టుకోకుండా ఉండమని కోరింది. అవసరమనుకుంటే వారి పెంపుడు జంతువులను ప్రభుత్వ క్వారంటేన్ సెంటర్లకు పంపాలని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ యజమానులు తమ పెంపుడు జంతువులను విడిచిపెట్టకూడదు అని ఆదేశాలు జారీ చేసింది.

See Also | పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కలకలం