10 Lakh Jobs: లక్షల్లో ఉద్యోగాలు.. అభ్యర్థులు కరువయ్యారు

కెనడాలో 10 లక్షల ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరగొచ్చని ఆ సర్వే పేర్కొంది. 2021 మేలో 3 లక్షలుగా ఉన్న ఈ ఖాళీలు ఏడాది గడిచేనాటికి ఇంత పెద్ద మొత్తంలో పెరగడం గమనార్హం. కెనడాలో ఇప్పటి వరకు ఉన్న జాబ్ వేకెంట్ రేటులో ఇదే అత్యధికం అంటున్నారు. కెనడాకు వలస వెళ్లే వారికి ఇది అధికంగా ఉపయోగపడనుంది. ఇందుకు అనుగుణంగా కెనడా ప్రభుత్వం సైతం పెద్ద ఎత్తున తమ దేశంలో స్థిర నివాసానికి అనుమతులు ఇవ్వాలని చూస్తోంది

10 Lakh Jobs: లక్షల్లో ఉద్యోగాలు.. అభ్యర్థులు కరువయ్యారు

Canada Has Over 10 Lakh Job Vacancies

10 Lakh Jobs: మన దేశంలో ఏ మూలకు వెళ్లినా నిరుద్యోగ సమస్యే కనిపిస్తుంటుంది. డిగ్రీలు చేత పట్టుకుని ఉపాధి కోసం ఎదురు చూసే యువతే ఎక్కడ చూసినా. పీహెచ్‭డీ చదివి ప్యూన్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలకు నిరుద్యోగం అనేది అతిపెద్ద విపత్తుగా దాపురించింది. కోట్లలో ఉన్న నిరుద్యోగులు ఉంటే ప్రభుత్వాలు ప్రకటించే ఖాళీలు వేలల్లో కూడా కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు ఇది ప్రచారాస్త్రంగా ఉంటే అధికారంలోకి వచ్చాక గుదిబండగా తయారవుతోంది. అయితే కెనడాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ అభ్యర్థులు లేక లక్షల్లో ఉద్యోగ ఖాళీలు ఏర్పడుతున్నాయట.

తాజాగా ది లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. కెనడాలో 10 లక్షల ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరగొచ్చని ఆ సర్వే పేర్కొంది. 2021 మేలో 3 లక్షలుగా ఉన్న ఈ ఖాళీలు ఏడాది గడిచేనాటికి ఇంత పెద్ద మొత్తంలో పెరగడం గమనార్హం. కెనడాలో ఇప్పటి వరకు ఉన్న జాబ్ వేకెంట్ రేటులో ఇదే అత్యధికం అంటున్నారు. కెనడాకు వలస వెళ్లే వారికి ఇది అధికంగా ఉపయోగపడనుంది. ఇందుకు అనుగుణంగా కెనడా ప్రభుత్వం సైతం పెద్ద ఎత్తున తమ దేశంలో స్థిర నివాసానికి అనుమతులు ఇవ్వాలని చూస్తోంది. 2024 నాటికి మొత్తంగా 4.3 లక్షల మందికి స్థిర నివాసం ఇవ్వాలని కెనడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఖ్యను అవసరమైతే 4.5 లక్షలకు పెంచనున్నారట.

విదేశాల్లో ఉద్యోగం చేయలనుకునే వారికి, కెనడాలో శాశ్వత నివాసం కోసం ప్రయత్నించే వారికి ఇది గొప్ప అవకాశం. ఇప్పుడు ఉన్న ఖాళీలకు తోడు తొందరలోనే మరింత పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడనున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. వృత్తిపరమైన, శాస్త్రీయ, సాంకేతిక సేవలు, రవాణా, గిడ్డంగులు, ఫైనాన్స్, భీమా, విశ్రాంతి-వినోదం, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో రికార్డు స్థాయిలో ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు నిర్మాణ రంగంలో ఎన్నడూ లేని విధంగా 89,900 ఉద్యోగాలు ఉన్నట్లు కెనడా మీడియా పేర్కొంది. కాబట్టి.. విదేశాలకు వెళ్లే ఆసక్తి ఉన్నవారు ఎవరైనా వెంటనే బ్యాగ్ సర్దేసేయండి. ఉద్యోగంతో పాటు పర్మినెంట్ అడ్రస్ కూడా దొరుకుతుంది.

Government Jobs : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ