Covid positive for Canada PM : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు కోవిడ్ పాజిటివ్

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రుడియా కొవిడ్‌ బారినపడ్డారు. కొద్దిపాటి లక్షణాలతో బాధపతుడున్న ఆయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గానిర్ధారణ అయ్యింది.

Covid positive for Canada PM : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు కోవిడ్ పాజిటివ్

Canada Pm Trudeau Tests Positive For Covid

Canada PM Trudeau tests positive for Covid : కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రుడియా కొవిడ్‌ బారినపడ్డారు. కొద్దిపాటి లక్షణాలతో బాధపతుడున్న ఆయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గానిర్ధారణ అయ్యింది. అయినా ఆయనకు ఎటువంటి ఇబ్బందులు లేవని ట్విటర్‌లో వెల్లడించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకా తీసుకోవాలని మరోసారి జస్టిన్ ట్రుడియా కోరారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. కాగా..ప్రధాని జస్టిన్‌ ట్రుడియా దేశంలో కోవిడ్ టీకా తప్పనిసరి చేశారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. ఎంతోమంది తమ నిరసనలు తెలిపారు.

Also read : Canada PM trolled” “కర్మ అనుభవించక తప్పదు” కెనడా ప్రధానిపై భారతీయుల ట్రోలింగ్

కెనడా రాజధాని ఒట్టావాలోని Parliament Hill వైపుకు వేలాది మంది నిరసనకారులు దూసుకొచ్చి నానా హంగామా చేశారు. దీంతో పార్లమెంట్ భవనం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందుజాగ్రత్తగా ప్రధాని జస్టిన్ ట్రూడో, అతని కుటుంబ సభ్యులు రహస్య ప్రదేశానికి తరలించారు.

కోవిడ్ వ్యాక్సినేషన్‌ తప్పనిసరి చేస్తూ ప్రధాని ఇచ్చిన ఆదేశాలు.. అనుహ్య పరిణామాలకు దారితీశాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళకు దిగారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విధించిన కరోనా నిబంధనలను వ్యతిరేకిస్తూ Freedom Convoy పేరుతో ట్రక్కు డ్రైవర్లు కెనడా రాజధాని ఒట్టావాను చుట్టుముట్టారు. నిరసనకారుల్లో వృద్దులు, పిల్లలు కూడా ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. కొంతమంది నిరసనకారులు ప్రముఖ యుద్ధ స్మారక చిహ్నంపై నృత్యం చేయడం కనిపించింది.

Also read : China Govt Policy : అగ్రరాజ్యాన్నే ఐ డోంట్ కేర్ అనే చైనా..ఆ ఒక్క విషయంలో మాత్రం హడలిపోతోంది..

కాగా నిరసనలు ప్రధాని భయపడ్డారంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. భారత్ నెటిజన్లు కూడా కెనడా ప్రధానిపై ట్రోలింగ్ చేసారు. సోషల్ మీడియాలో ఆటాడుకుంటున్నారు. ఇప్పుడు కర్మ అంటే ఏంటో తెలిసిందా అంటూ ట్రూడో పై తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మనకంటూ ఒకరోజు వస్తుంది.. ఆరోజు కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదంటూ భారతీయ నెటిజన్లు.. కెనడా ప్రధాని ట్రూడోను తెగ ట్రోల్ చేస్తున్నారు. కానీ కోవిడ్ ను నియంత్రించటానికి టీకా వేయించుకోవటం తప్పనిసరి అని ఆదేశించటంలో తప్పేంటో అర్థకాని పరిస్థితి.