Cigarette : ఇక తాగే ప్రతి సిగరెట్‌పై ఇదే హెచ్చరిక.. ఆ దేశంలోనే ఫస్ట్..!

సిగరెట్ తాగుతున్నారా? అయితే ఈ హెచ్చరిక మీకోసమే.. ఇప్పటివరకూ సిగరెట్ ప్యాకెట్లపై కనిపించే హెచ్చరిక సిగరెట్లపై కూడా కనిపించనుంది.

Cigarette : సిగరెట్ తాగుతున్నారా? అయితే ఈ హెచ్చరిక మీకోసమే.. ఇప్పటివరకూ సిగరెట్ ప్యాకెట్లపై కనిపించే హెచ్చరిక సిగరెట్లపై కూడా కనిపించనుంది. ప్రతి సిగరెట్ పై ప్రింటెడ్ వార్నింగ్ తో రానున్నాయి. ఇక్కడ కాదండోయ్.. కెనడాలో.. ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కెనడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే.. ప్రపంచంలో సిగరెట్లపై ప్రింటెడ్ వార్నింగ్స్ తీసుకురానున్న తొలి దేశంగా కెనడా అవతరించనుంది.

ప్రపంచవ్యాప్తంగా సిగరెట్ల బాక్స్‌లపై ఫొటోలతో పాటు కొంత సమాచారంతో హెచ్చరికలు మాత్రమే ఉన్నాయి. అయితే సిగరెట్ బాక్సులపై ఆ హెచ్చరికలను చూసినా స్మోకర్లు అలానే తాగేస్తున్నారు. వారిలో ఆరోగ్యంపై భయమే కాదు.. పొగతాగే అలవాట్లను మానుకున్నదే లేదు. అందుకే కెనడా ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. ఇకపై ప్రతి సిగరెట్‌పై హెచ్చరికలు ప్రింటెండ్ ఉంటాయి.

Canada Set To Become First Nation To Introduce Written Warning On Every Cigarette

సిగరెట్ తాగేవాళ్లు ఆ ప్రింటెడ్ వార్నింగ్ చూసిన తర్వాత స్మోకింగ్ అలవాటు మానుకుంటారని ఆశిస్తున్నట్టు కెనడా ఆరోగ్య మంత్రి కరోలిన్ బెన్నెట్ తెలిపారు. బాక్సులపై హెచ్చరికలను ముద్రించడం ద్వారా ఆ బాక్సులను వాడి పడేస్తున్నారు. అదే తాగే సిగరెట్లపై ప్రింటెడ్ వార్నింగ్ వేస్తే.. ప్రతి పఫ్ లో విషాన్ని పీలుస్తున్నామనే విషయం వారికి తెలుస్తుంది. ఇలా ప్రతిఒక్కరికి తొందరగా ఈ మెసేజ్ చేరుతుందని, కొందరిలో కొందరైనా పొగ అలవాటు మానుకుంటారని కెనడా ప్రభుత్వం భావిస్తోంది.

Read Also : Boy smokes Packet cigarettes: ‘రాకీ భాయ్’లా మారాలని ప్యాకెట్ సిగరెట్స్ కాల్చిన బాలుడు: ఆసుపత్రిపాలు

ట్రెండింగ్ వార్తలు