Mahmoud Jamal : కెన‌డా సుప్రీంకోర్టు జడ్జీగా భార‌త్‌ మూలాలున్న వ్యక్తి

146 ఏళ్ల కెన‌డా సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లో దేశ ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. కెనాడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలిసారి భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి నామినేట్ అయ్యారు. గురువారం (జూన్ 17,2021)న కెనడా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో తొలిసారి శ్వేత‌జాతీయుడిని కాకుండా భారతీయ మూలాలు ఉన్న మ‌హ‌మూద్ జ‌మాల్‌ ను సుప్రీంకోర్టు జడ్జీగా నామినేట్ చేశారు.

Mahmoud Jamal : కెన‌డా సుప్రీంకోర్టు జడ్జీగా భార‌త్‌ మూలాలున్న వ్యక్తి

Canada Supreme Court Judge Indian First Person

canada supreme court Judge indian first person : 146 ఏళ్ల కెన‌డా సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లో దేశ ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. కెనాడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలిసారి భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి నామినేట్ అయ్యారు. గురువారం (జూన్ 17,2021)న కెనడా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో తొలిసారి శ్వేత‌జాతీయుడిని కాకుండా భారతీయ మూలాలు ఉన్న మ‌హ‌మూద్ జ‌మాల్‌ ను సుప్రీంకోర్టు జడ్జీగా నామినేట్ చేశారు.

146 ఏళ్లుగా సుప్రీంకోర్టు జ‌డ్జిలుగా తెల్ల‌జాతీయులు మాత్ర‌మే ఉంటున్నారు. కానీ తొలిసారి ఆ సంప్రదానికి ప్రధాని జస్టిన్ ట్రూడో కొత్త అధ్యాయానికి నాందిపలికారు. సుప్రీంకోర్టు జ‌డ్జిగా నామినేట్ అయిన మ‌హ‌మూద్ జ‌మాల్‌కు భార‌త్‌లోని గుజ‌రాత్ మూలాలు కలిగి ఉండటం విశేషం. 2019 మహమూద్ జమాల్ ఒంటారియో కోర్టు ఆఫ్ అప్పీల్ జ‌డ్జిగా జ‌మాల్ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో జమాల్ సుప్రీంకోర్టులో జరిగిన 35 కేసుల విచారణలో హాజరయ్యారు. ఈ క్రమంలో జమాల్ ను ప్రధాని సుప్రీంకోర్టుకు జడ్జిగా నామినేట్ చేసి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ట్రుడో ట్వీట్ చేశారు. “కెన‌డా సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లో ఇదో చారిత్రాత్మ‌క ఘ‌ట్టం” అని జ‌మాల్ నామినేష‌న్‌ను ఉద్దేశించి ధాని ట్రూడో ట్వీట్ చేయటం మరో విశేషం.

గుజ‌రాత్‌కు చెందిన జ‌మాల్ త‌ల్లిదండ్రులు 1969లో మొద‌ట బ్రిట‌న్ వల‌స వెళ్లారు. ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నామినేట్ అయిన సందర్భంగా జమాల్ మాట్లాడుతూ.. స‌మ‌యంలో అక్క‌డ‌ శ‌రీర వ‌ర్ణం వల్ల వారి కుటుంబం ఎదుర్కొన్న అవ‌మానాల‌ను ఎదుర్కొన్నామని గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత 1981లో యూకే నుంచి కెన‌డాకు వ‌చ్చామని తెలిపారు. కెనడా వచ్చాక కూడా పలు సందర్భాల్లో వ‌ర్ణ వివ‌క్ష‌కు గురైయ్యామని వెల్లడించారు. ఎన్నో సార్లు..ఎన్నో సందర్భాల్లో వర్ణ వివక్ష ఎదుర్కొన్న కుటుంబం నుంచి వచ్చిన నేను ఇప్పుడు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానానికి న్యాయమూర్తిగా నామినేట్ కావ‌డం ఎంతో గ‌ర్వ‌ంగా ఉంద‌ని తెలిపారు.

కాగా జమాల్ అంటారియో కోర్టులో జడ్జీగా కొనసాగటానికి ముందు కెనాడా లా స్కూల్లో మాస్టారిగా పనిచేశారు. అంతేకాదు ఎన్నో సంవత్సరాలు లాయర్ గా పనిచేశారు. పలు కేసుల్లో వాదించి విజయం సాధించారు.జమాల్ కుటుంబం బ్రిటన్ వెళ్లటానికి ముందు కెన్యాలో ఉండేవారు. నైరోబిలో ఉన్న ఒక భారతీయ కుటుంబంలో జమాల్ జన్మించారు. ఆ తరువాత వారికుటుంబం బ్రిటన్ కు వెళ్లగా జమాల్ అక్కడే పెరిగారు. 1981లో కెనాడా చేరుకున్నారు. అలా అక్కడ కూడా వర్ణ వివక్ష ఎదుర్కొన్న ఆయన ఆ దేశ అత్యున్నత ధర్మాసనానికే న్యాయమూర్తిగా నియమించబడ్డారు.