Fuel In Water Supply : త్రాగు నీటిలో అధికస్థాయిలో కిరోసిన్,డీజిల్!
కెనడాలోని ఉత్తర ప్రాంతమైన నునావుట్ రాజధాని ఇకాలూయిట్ సిటిలోని భూగర్భ జలాల్లోని తాగు నీటిలో అధిక శాతం ఇంధన ఆయిల్ లు ఉన్నట్లు శుక్రవారం స్థానిక అధికారులు ప్రకటించారు.

Canada
Fuel In Water Supply కెనడాలోని ఉత్తర ప్రాంతమైన నునావుట్ రాజధాని ఇకాలూయిట్ సిటిలోని భూగర్భ జలాల్లోని త్రాగు నీటిలో అధిక శాతం ఇంధన ఆయిల్ లు ఉన్నట్లు శుక్రవారం స్థానిక అధికారులు ప్రకటించారు. గ్రీన్‌ల్యాండ్‌కి సరిహద్దుగా ఉన్న ఇకాలూయిట్‌లో వాటర్ ట్యాంక్ నుంచి సేకరించిన శాంపిల్స్ లో వివిధ ఫ్యూయల్ కాపంపోనెంట్స్ అధిక స్థాయలో ఉన్నట్లు ల్యాబ్ ఫలితాల్లో నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు.
భూగర్భ జల కాలుష్యం కారణంగా ట్యాంక్‌లోని నీటిలో అధికంగా ఇంధన వాసన వస్తుండవచ్చని… బహుశా ఆ వాసన డీజిల్ లేదా కిరోసిన్‌కి సంబంధించిన వాసన కావచ్చని ఇకాలూయిట్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అమీ ఎల్గర్స్మా తెలిపారు. ఈ నీటిని వినియోగిస్తే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పై అత్యంత ప్రభావం చూపే అవకాశం ఎక్కువ అంటూ నునావుట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మైఖేల్ ప్యాటర్సన్ ప్రజలను హెచ్చరించారు.
సురక్షితమైన నీరు అందుబాటులోకి వచ్చేంత వరకు ఇకాలూయిట్ వాసులు ఈ నీటిని ప్రజలు ఈ నీటిని ఉపయోగించవద్దని సూచించారు. నీటిని కాచినప్పటికీ ఆ వాసన పోదని, ట్యాంకులోని నీటిని ఎప్పటి నుంచి వినయోగించుకోవచ్చో తామే తెలియజేస్తామన్నారు.
ALSO READ ఆరో తరగతి విద్యార్థినికి సీఎం ఫోన్..ఏం చెప్పారంటే