ఇజ్రాయిల్ లో ఆకాశం నుంచి గంజాయి ప్యాకెట్ల వర్షం

  • Published By: madhu ,Published On : September 5, 2020 / 08:48 AM IST
ఇజ్రాయిల్ లో ఆకాశం నుంచి గంజాయి ప్యాకెట్ల వర్షం

ఇజ్రాయిల్ అత్యధిక జనాభ కలిగిన Tel Aviv లో ఆకాశం నుంచి భారీగా గంజాయి పొట్లాలు పడడం కలకలం రేపింది. సెప్టెంబర్ 03వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది వీటిని ఏరుకోవడానికి పోటీ పడ్డారు. వీటిని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.



క్షణాల్లో వైరల్ అయ్యాయి. కొంతమంది ఈ ఘటనకు పాల్పడ్డారని సమాచారం. డ్రోన్ ద్వారా గంజాయి పొట్లాలను జార వేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి కారకులైన వారిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనలు, రాజకీయ ర్యాలీలకు పేరొందిన Rabin Squareలో పొట్లాలను తీసుకోవడానికి పోటీ పడ్డారు.