హెల్త్ కేర్ కి డబ్బులు లేవా…అమెరికా రావొద్దు : కొత్త ఫ్లాన్ కి ట్రంప్ ఆమోదం

  • Published By: venkaiahnaidu ,Published On : October 5, 2019 / 07:09 AM IST
హెల్త్ కేర్ కి డబ్బులు లేవా…అమెరికా రావొద్దు : కొత్త ఫ్లాన్ కి ట్రంప్ ఆమోదం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.  అమెరికాలోకి ప్రవేశించిన 30 రోజులలోపు ఆరోగ్య భీమా పరిధిలోకి రాని, లేదా వారి ఆరోగ్య సంరక్షణ ఖర్చులను స్వయంగా భరించే మార్గాలు లేని వలసదారుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్న ప్రకటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. ఆశ్రయం లేదా శరణార్థి హోదా కోసం ఏ వ్యక్తి యొక్క అర్హతను శ్వేతసౌధం జారీ చేసిన ఈ ప్రకటన ప్రభావితం చేయదని అధికారులు తెలిపారు.

నవంబర్ 3,2019 నుంచి ఇది అమల్లోకి వస్తుందని వైట్ హౌస్ తెలిపింది. 2020 ఆర్థిక సంవత్సరంలో 18 వేల మంది శరణార్థులను మాత్రమే అమెరికాలో పునరావాసం కోసం అనుమతించాలని ట్రంప్ యంత్రాంగం గత నెలలో తెలిపింది. ఆధునిక శరణార్థుల ప్రోగ్రాం చరిత్రలో అతి తక్కువ సంఖ్య

మా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సంక్లిష్ట సంరక్షణ వలన కలిగే సవాళ్లతో ముడిపడి ఉన్న సమయంలో యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం… వారి ఆరోగ్య సంరక్షణ ఖర్చులను భరించే సామర్థ్యాన్ని ప్రదర్శించని వేలాది మంది విదేశీయులను అంగీకరించడం ద్వారా సమస్యను మరింత తీవ్రతరం చేస్తోందని ట్రంప్ గత నెలలో ప్రకటనలో అన్న విషయం తెలిసిందే. ఇమ్మిగ్రెంట్ వీసాతో అమెరికాలోకి ప్రవేశించాలనుకునే వ్యక్తులకు మాత్రమే ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని ఆయన అన్నారు.