Elon Musk : కార్ల తయారీపై మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు‌.. ఊహించని రిప్లయ్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ కార్ల తయారీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్ల తయారీ కష్టమని ఆయన అన్నారు. అంతేకాదు లాభాలతో కార్ల తయారీ సంస్థను నడపడం..

Elon Musk : కార్ల తయారీపై మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు‌.. ఊహించని రిప్లయ్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

Elon Musk

Elon Musk : ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ కార్ల తయారీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్ల తయారీ కష్టమని ఆయన అన్నారు. అంతేకాదు లాభాలతో కార్ల తయారీ సంస్థను నడపడం ఇంకా కష్టమని తెలిపారు. ఎలాన్ మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ఊహించని విధంగా రిప్లయ్ ఇచ్చారు.

కార్ల తయారీ కష్టమన్న మస్క్ వ్యాఖ్యలతో మహీంద్ర ఏకీభవించారు. కష్టమైనప్పటికీ.. ఈ రంగంలోనే గత నాలుగు దశాబ్దాలుగా చెమటోడుస్తూనే ఉన్నామన్నారు. చివరకు అదే తమ జీవన శైలిగా మారిపోయిందన్నారు. ట్విటర్‌ లో ఇద్దరి మధ్య జరిగిన చర్చ ఇది. కాగా, ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌పై మస్క్‌ ఇంకా స్పందించాల్సి ఉంది.

Debit Cards : నో నెట్‌వర్క్.. ఆఫ్‌లైన్‌లోనూ డెబిట్ కార్డులు వాడొచ్చు!

జేమ్స్‌ డైసన్‌ అనే ప్రముఖ బ్రిటిష్ శాస్త్రవేత్త, బిలియనీర్‌ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం ఇటీవల విడుదలైంది. దీన్ని చదివిన ఆంటోనీ అనే ఓ ఇంజినీర్.. పుస్తకంలో ఉన్న కీలకాంశాల్ని హైలైట్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. చాలా కాలం క్రితం విద్యుత్తు కార్లను తయారు చేసేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేసి డైసన్ విఫలమైన విషయాన్ని ప్రస్తావించారు.

దీనిపై స్పందించిన మస్క్‌.. కార్ల తయారీ కష్టమని తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న సంప్రదాయ కార్ల తయారీ సంస్థలు తక్కువ లేదా ఎలాంటి లాభం లేకుండానే వాహనాలు విక్రయిస్తున్నాయని తెలిపారు. కొంతకాలం తర్వాత కార్లలో రీప్లేస్‌ చేయాల్సిన విడిభాగాల ద్వారానే కంపెనీలు లాభాలు ఆర్జిస్తున్నాయని తెలిపారు. అయితే, ఇప్పటి కార్ల తయారీ సంస్థలకు ఆ ఆస్కారం లేదన్నారు.

Remove Apps : వార్నింగ్.. మీ ఫోన్‌లో ఈ 4 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ కు 3వేల 800 లైకులు వచ్చాయి. పెద్ద సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే.. గత వారం, మహీంద్రా అండ్ మహీంద్రా ఆగస్టులో దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో 17 శాతం పెరుగుదల నమోదు చేసింది.