UK PM Rishi Sunak: బ్రిటన్ ప్రధాని నివాసం గేటును ఢీకొట్టిన కారు.. భద్రతా సిబ్బంది ఏం చేశారంటే..

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికార నివాసం లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ గేటును గుర్తు తెలియని వ్యక్తి కారుతో ఢీకొట్టాడు.

London Police: రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను హత్య చేసేందుకు అంటూ ఓ భారతీయ సంతతి యువకుడు సాయి వర్షిత్ అమెరికా అధ్యక్ష భవనం గేటును ట్రక్కుతో ఢీకొట్టిన విషయం విధితమే. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం.. సాయి వర్షిత్‌కు పదేళ్లు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి తరహా ఘటన బ్రిటన్ లోనూ చోటు చేసుకుంది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికార నివాసం లండన్ లోని 10 డౌనింగ్ స్ట్రీట్ గేటును గురువారం సాయత్రం వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. అయితే, కారు డ్రైవ్ చేసే వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నాడు.

Joe Biden : అమెరికా అధ్యక్షుడు బైడెన్ హత్యకు తెలుగు యువకుడు కుట్ర .. అరెస్ట్ చేసిన పోలీసులు, విచారణలో సంచలన విషయాలు

లండన్ లోని 10డౌనింగ్ స్ట్రీట్ గేటును వ్యక్తి కారుతో కావాలనే ఢీకొట్టాడా? అనుకోకుండా జరిగిందా అనే విషయంపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ వీధిలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారా అనే అనుమానంతో ఆ ప్రాంత పరిసరాల్లో తనిఖీలు సైతం చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రధాని రిషి సునాక్ తన కార్యాలయంలోనే ఉన్నారు. ఘటన జరిగిన కొద్దిసేపటి తరువాత రిషి సునాక్ వేరే మార్గం నుంచి కార్యాలయం నుంచి బయటకు వెళ్లారు.

Joe Biden..Trump : బైడెన్‌ను అనుకరిస్తు హేళన చేసిన ట్రంప్ ..

లండన్‌లోని 10డౌనింగ్ స్ట్రీట్ వద్ద నిత్యం పటిష్ఠ భద్రత ఉంటుంది. రక్షణ వ్యవస్థలో భాగంగా బలమైన ఇనుప గేట్లూ అమర్చారు. అయితే, ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కావాలనే ఢీకొట్టాడా? అనుకోకుండా కారు అదుపు తప్పి అటువైపు వెళ్లిందా అనే కోణంలో విచారిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు