సూయిజ్ కాలువలో ఇరుక్కుపోయిన అతిపెద్ద నౌక

సూయిజ్ కాలువలో ఇరుక్కుపోయిన అతిపెద్ద నౌక

Cargo Ship Ever Green Stuck In Suez Canal

cargo ship Ever Green stuck in suez canal : ఈజిప్టులోని సూయిజ్ కాలువలో ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ఇరుక్కుపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా నౌకల్లో ఒకటైన ‘ఎంవీ ఎవర్‌గివెన్’ ప్రమాదవశాత్తు సూయిజ్ కాలువలో చిక్కుకుపోయింది. దీంతో ఇతర నౌకల రాకపోకలకు తీవ్రం అంతరాయం ఏర్పడింది.

400 మీటర్ల పొడవున్న ఈ అతి పెద్దనౌక 2.20 లక్షల టన్నులతో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో సూయాజ్ కాలువలో చిక్కుకుపోయింది. ఓడ తూర్పు పైభాగం తూర్పు గోడను, కింది భాగం పశ్చిమ గోడను తాకటంతో అక్కడే ఇరుక్కుపోయి కదలకుండా నిలిచిపోయింది.

కాగా ఇటువంటి ఘటన జరిగటం గత 150 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. సూయిజ్ కాలవ మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలుపుతుంది. ఈ క్రమంలో నౌక చిక్కుకుపోవటంతో ఇతర నౌకల రాకపోకలకు అంతరాయి ఏర్పడింది. చిక్కుకుపోయిన నౌకను తిరిగి యథాస్థితిలోకి తీసుకురావటానికి కనీసం రెండు మూడు రోజులు పడుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ ప్రక్రియ సజావుగా పూర్తి అయ్యేలోపు ఈ మార్గంలో ప్రయాణించాల్సిన ఇతర నౌకలపై సముద్రపు దొంగలు దాడిచేసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.తగిన ఏర్పాట్లు చేశారు.