కరోనా జస్ట్ శాంపుల్ మాత్రమే ఇది.. అసలైనది ముందుంది

కరోనా జస్ట్ శాంపుల్ మాత్రమే ఇది.. అసలైనది ముందుంది

దక్షిణ కొరియాలో కరోనా వైరస్ కేసులు నాలుగింతలైయ్యాయి. ఓ మతశాఖకు చెందిన 144 మందికి చేసిన వైద్య పరీక్షల్లో పాజిటీవ్ ఫలితాలు వచ్చాయి. సింగపూర్ లో రెండు చర్చ్ లు , బిజినెస్ మీటింగ్, హెల్త్ ప్రొడెక్ట్ షాప్, నిర్మాణ ప్రాంతాల్లోనే కరోనా వైరస్ వేగంగా సంక్రమిస్తోందని ప్రభుత్వం కనిపెట్టింది. ఇరాన్ దేశస్థుల నుంచి కరోరా వైరస్ లెబనాన్, కెనడాలకు పాకింది. అనుకున్నదానికంటే కొత్త ప్రాంతాలకు, దేశాలకు చేరుతుంది. అదీ అత్యంత వేగంగా!

ఇతరదేశాల్లో కరోనా బాధితులకు, చైనాకు ఎలాంటి సంబంధమూ లేదు. అసలు చుట్టుప్రక్కల వాళ్లకూ కరోనాలేదు. మరి ఇదెక్కడ నుంచి వచ్చిపడుతోంది? FLU లాంటి వ్యాధులను కట్టడిచేయడం అంత సులువేం కాదు. అలాగని  covid-19ను మహమ్మారిగా ఇంతవరకు ప్రపంచఆరోగ్యసంస్థ ప్రకటించలేదు. కరోనా ఇప్పటిదాకా 2,200 మందికి పైగా బాధితులను బలితీసుకుంది. అందుకే ప్రపంచ ఆరోగ్యసంస్థ స్వరం మారుతోంది. కొత్త వైరస్ ను కట్టడం చేయడం రోజురోజుకీ కష్టతరమవడంతో ఆరోగ్యసంస్థ కూడా ఆందోళన పడుతోంది.

కొత్త వైరస్ ప్రబలుతున్నప్పుడు రోగులను మిగిలినవారినుంచి వేరుచేశారు. ప్రత్యేక హాస్పిటల్ లో ట్రీట్‌మెంట్ చేశారు. బాధితులు ప్రపంచవ్యాప్తంగా నెల రోజుల విరామంలో ఎవరెవరిని కలిశారో తెలుసుకొని, వాళ్లనూ పిలిపించి కరోనా టెస్ట్ లు చేశారు. ప్రతిఒక్కరి ఫ్యామిలీ ట్రీని తయారుచేశారు. వాళ్లలో ఏవైనా లక్షణాలు కనిపిస్తాయా అని టెస్ట్ చేశారు. కాకపోతే, 80వేల మందికి కరోనా సోకింది కాబట్టి, వాళ్ల ఫ్యామిలీలు, వాళ్లను కలసివాళ్లు, అందరినీ పరీక్షించి,  ట్రీట్ చేయడమంటే లక్షల మందిని పరీక్షించడమే. 

కొన్ని వ్యాధులు ప్రబలుతాయి. మరికొన్ని మహమ్మారిలా కమ్మేస్తాయి. కరోనావైరస్ అంతే. చైనాలో కాస్త తగ్గుముఖం పట్టిందనుకొనేలోపే కొత్త దేశాలకు పాకుతోంది. బాధితులు వందల్లోంచి వేలల్లోకి చేరుతున్నారు. ఇప్పుడు ప్రపంచం మహమ్మారిని ఎదుర్కొవడానికి సిద్ధం కావాలసిందే. 

ఒకవేళ కరోనావైరస్ నిజంగా మహమ్మారిగా మారితే, ప్రతి ముగ్గురిలో సగం, అంతకన్నాఎక్కువమందికి ప్రమాదం పొంచిఉన్నట్లే. కరోనా వచ్చినా పేషెంట్ మామూలుగానే కనిపిస్తాడు. జ్వరం రావచ్చు, రాకనూపోవచ్చు. అందుకే ‘pandemic’మహమ్మారి అంటే భయం కలగొచ్చు. కంట్రోల్ అయ్యిందనుకున్న కరోనా ఎంతటి ప్రమాదమో చెప్పడానికి ఈ పదమే సరైంది.

సార్స్ లా పక్కవాళ్లను వ్యాపిస్తుందని తేలితే అలాంటి వ్యాధులను కట్టడిచేయడం కాస్త సులువే. సార్స్ ఎవరికి వచ్చిందో మనకు చూడగానే తెలిసిపోతుంది. సిక్ అయిపోతారు. వాళ్లను దూరంగా ఉంచితే సరిపోతుంది. కానీ, ఈ కొత్త వైరస్ వచ్చినా మనుషులు దిట్టంగా కనిపిస్తారు. రోగమొచ్చిందో లేదో నిపుణులు కూడా కంటిచూపుతో చెప్పలేరు. కొన్నికేసుల్లో covid-19వచ్చినా, దాని ప్రభావం కొద్దిగా ఉంటుంది. అందుకే టాక్సీ డ్రైవర్లు, బిజినెస్ మీటింగ్స్‌కు వెళ్లినవాళ్లు, డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లోని 600 మందికిపైగా ప్రయాణీకులకు పాజిటివ్ వచ్చినా, వాళ్లకు పెద్దగా రోగ లక్షణాలు కనిపించలేదు.