Horse Collapsed Video: ఎండ వేడిమిని భరించలేక రోడ్డుపైనే కుప్పకూలిన గుర్రం..

క్యారేజ్ లాగుతున్న రైడర్ అనే గుర్రం ఎండ వేడిమిని భరించలేక నడిరోడ్డు పై కుప్పకూలిపోయింది.. స్పృహతప్పి పడిపోయి ఎంతకీ లేవకపోవడంతో అశ్వ దళం యూనిట్ పోలీసులు వచ్చి గుర్రానికి భారీగా వాటర్ కొట్టి ప్రథమ చికిత్స చేశారు. గంట తరువాత కానీ గుర్రం తేరుకుంది.

Horse Collapsed Video: ఎండ వేడిమిని భరించలేక రోడ్డుపైనే కుప్పకూలిన గుర్రం..

Carriage horse collapses

Horse Collapsed Video: క్యారేజ్ లాగుతున్న రైడర్ అనే గుర్రం ఎండ వేడిమిని భరించలేక నడిరోడ్డు పై కుప్పకూలిపోయింది.. స్పృహతప్పి పడిపోయి ఎంతకీ లేవకపోవడంతో అశ్వ దళం యూనిట్ పోలీసులు వచ్చి గుర్రానికి భారీగా వాటర్ కొట్టి ప్రథమ చికిత్స చేశారు. గంట తరువాత కానీ గుర్రం తేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన జంతు ప్రేమికులు గుర్రం బండ్ల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గుర్రం బండ్లను నిషేధించాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన న్యూయార్క్ నగరంలో మాన్ హట్టన్ హెల్స్ కిచెన్ ప్రాంతంలోని కూడలి వద్ద చోటు చేసుకుంది.

Jammu and Kashmir: తీవ్రవాదులతో లింకులు… నలుగురు ఉద్యోగుల తొలగింపు

ఎండ వేడిమికి తాళలేక రైడర్ అనే గుర్రం న్యూయార్కు లోని రద్దీ రహదారిపై కుప్పకూలిపోయింది. దీంతో నిర్వాహకుడు దానిని లేపేందుకు తీవ్రంగా శ్రమించాడు. అయినా గుర్రం లేవకపోవడంతో పాటు స్పృహ కోల్పోయింది. దీంతో కొరడాతో గుర్రాన్ని కొట్టడం ప్రారంభించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే అక్కడకు ప్రజలు గుమ్మికూడడంతో గుర్రాన్ని కొట్టొద్దని వారించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాటర్ ట్యాంకర్ తో అక్కడికి చేరుకున్న పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన అశ్వ దళం పోలీసులు గుర్రాన్ని భారీగా వాటర్ తో తడిపారు. గుర్రంకు ప్రథమ చికిత్సను అందించడంతో గంట తరువాత గుర్రం కోలుకుంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు గుర్రం యాజమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు గుర్రం బండ్ల నిషేధం పై రాజకీయ నేతలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉంటే రైడర్ గుర్రం హాయిగా విశ్రాంతి తీసుకుంటుందని, రోజంతా ఎండుగడ్డి తినడంతో పాటు, సాధారణ స్థితికి వచ్చిందని  గుర్రం యాజమాని తెలిపాడు.