Cat Burglar: దొంగ పిల్లి..ఇరుగు పొరుగు ఇళ్లలో అన్ని దొంగిలించి యజయానికి ఇంట్లో దాస్తోంది..

ఇరుగు పొరుగు ఇళ్లలో అన్ని దొంగిలించి యజయానికి ఇస్తున్న పిల్లి..

Cat Burglar: దొంగ పిల్లి..ఇరుగు పొరుగు ఇళ్లలో అన్ని దొంగిలించి యజయానికి ఇంట్లో దాస్తోంది..

Cat Burglar

Cat Burglar : పాడు పిల్లి..దొంగ పిల్లి రోజు ఇంట్లో దూరి పాలన్ని తాగేస్తోంది..పెరుగంతా జుర్రేస్తోంది అని తిట్టుకుంటాం. కానీ ఓ పిల్లి అయితే దొంగపిల్లే కాదు చాలా ఖతర్నాక్ పిల్లిలాగుంది. ఇరుగు పొరుగు ఇళ్లల్లో దూరి కంటికి కనిపించినవల్లా ఎత్తుకొచ్చేస్తోంది. చెప్పులు, బూట్లు, స్విమ్‌ సూట్లు, గ్లౌజ్‌లు, మహిళల లోదుస్తులు, చేపలు,మాంసం ఇలా కనిపించినవన్నీ ఎత్తుకొచ్చేస్తోంది. చేపలు,మాంసం అయితే ఎత్తుకొచ్చి తినేస్తోంది అనుకుందాం..కానీ బట్టలు, బూట్లు, చెప్పులు ఏం చేస్తోంది అంటే..ఎత్తుకొచ్చినవన్నీ తనను పెంచుకునే యజమానికి ఇస్తోంది…!! చూసారా? మరి..ఇది దొంగపిల్లే కాదు ఖతర్నాక్ పిల్లి అని ఎందుకు అన్నామో..ఈ టక్కరి పిల్లి గురించి భలే భలే సంగతులున్నాయి లెండి అవన్నీ ఏంటో తెలిసేసుకుందామా..

Read more : Tollywood Films : తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెరిగాయి..ఎంతంటే

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ నగర శివార్లలో నివపించే గిన్నీ, డేవిడ్‌ దంపతులు ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. దానికి ఐదేళ్లు. నల్లటి పిల్లి. దాని పేరు.. కీత్‌. దీనికి ‘దొంగ’బుద్ధి ఎక్కువ. దీని దొంగబుద్ధితో ఇరుగుపొరుగువారికి ఆందోళన పెరుగుతోంది. ఎందుకంటే ఇళ్లల్లో ఎన్నో వస్తువులు మాయం అయిపోతున్నాయి. అవి ఏం అవుతున్నాయో అర్థం కావట్లేదు. కానీ అది కీత్ అనే నల్లటి పిల్లి చేసే ఘనకార్యం అనే విషయం తెలియదు.

అందరు పడుకున్నాక..అర్థరాత్రి నిశ్శబ్దంగా చుట్టుపక్కల వాళ్ల ఇళ్లలోకి జొరబడటం… కంటపడ్డ వస్తువులను పట్టుకొచ్చేయడం దీనికి అలవాటుగా మారింది. చెప్పులు, బూట్లు, స్విమ్‌ సూట్లు, గ్లౌజ్‌లు, మహిళల లోదుస్తులు, చేపలు, మాంసం, టోపీలు, పిల్లల బట్టలు ఏది కనిపించినా ఎత్తుకొచ్చేయటమే దీని పని. అలా ఓ పోలీసు అధికారి షర్టు కూడా ఎత్తుకొచ్చేసింది. అలా ఎత్తుకొచ్చినవాటిని తన యజమానుల ఇంటికి తెచ్చేస్తోంది.

Read more :Call Data : యూజర్ల కాల్‌ డేటాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు… రెండేళ్లు పాటు భద్రపరచాలి

మూడేళ్లుగా ఈ నల్లపిల్లి దొంగతనాలకు హద్దు పద్దు లేకుండాపోతోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇళ్లళ్లో పలు రకాల వస్తువులు కనిపించకుండాపోతున్నాయి. ఏం అవుతున్నాయో తెలియట్లేదు. గత మూడేళ్లనుంచి ఈ దొంగపిల్లి వల్ల ఎన్నో పోగొట్టుకున్నా..అది కీత్ గారి ఘనకార్యమే అని తెలుసుకోలేకపోతున్నారు పాపం చుట్టుపక్కలవారు.

కానీ ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. రోజుకు ఐదారు వస్తువులను కొట్టుకొస్తోంది.ఇటీవల గంజాయి పీల్చే హుక్కా లాంటి ఓ గాజు పరికరాన్ని కూడా ఎత్తుకొచ్చేసింది. అలాగే తెల్లటి పొడితో నిండిన చిన్న బ్యాగును పట్టుకొచ్చేసింది. దాంతో దీని ఘనకార్యాలు పోలీసులకూ తెలిశాయి. అవి ఎక్కుడునుంచి తెచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసోలు. పోలిసులు రంగ ప్రవేశంతో అసలు విషయం తెలిసింది. ఇదంతా ఆ దొంగపిల్లి పనే అని తెలిసి ఆశ్చర్యపోయారు స్థానికులు.

దీంతో పాపం గిన్నీ, డేవిడ్ లు..ఎంతైనా ఐదేళ్ల నుంచి పెంచుకుంటున్న పెంపుడు పిల్లి కాబట్టి గిన్నీ, డేవిడ్‌లు దీన్ని కట్టడి చేయలేక… ఇరుగుపొరుగుతో ఇబ్బందులు రాకూడదని ఓ ఆలోచన చేశారు. తమ ఇంటి ఆవరణలో ఓ ప్లాస్టిక్‌ బుట్ట పెట్టి… కీత్‌ ఎత్తుకొచ్చేస్తున్న వస్తువులను అందులో ఉంచుతున్నారు. ఇరుగుపొరుగు తమ ఇంట్లో బూట్లు, ఇతర ఏదైనా వస్తువులు కనపడకపోతే ఇక్కడికొచ్చి… బుట్టలో వెతికి పట్టుకుపోతున్నారు. ఇదీ ఈ దొంగపిల్లి కథ. భలే ఉంది కదూ..ఈ దొంగ ఖతర్నాక్ పిల్లి కథ..