పెంపుడు పిల్లికి కరోనా వైరస్ పాజిటివ్

  • Published By: veegamteam ,Published On : March 28, 2020 / 07:15 AM IST
పెంపుడు పిల్లికి కరోనా వైరస్ పాజిటివ్

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. అయితే ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 27 వేల మందికి పైగా చనిపోయారు. కరోనా వైరస్ అనేది ఇప్పటివరకు మనుషులకే రావటం చూస్తున్నాం. తాజాగా బెల్జియంలోని ఓ పెంపుడు పిల్లికి వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీని బట్టి పెంపుడు జంతువులకు వైరస్ వ్యాపిస్తుంది. 

వివరాల్లోకి వెళ్తే.. ఆ పిల్లిని పెంచుకుంటున్న వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దాంతో ఆ పిల్లికి కూడా వైరస్ టెస్టు చేస్తే పాజిటివ్ అని వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో పిల్లిని 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచాలని వైద్యులు ఆదేశించారు. హాంగ్ కాంగ్ లో కుక్కలకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే కుక్కల్లలో మాత్రం వైరస్ లక్షణాలు కనిపించలేదు. కానీ ఈ పిల్లిలో మాత్రం కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. 

ఆ పిల్లి శ్వాస కోశ, జీర్ణ సమస్యలతో బాధపడుతోందని బెల్జియం ఫుడ్‌ సేఫ్టీ ఏజెన్సీ ఏఎఫ్‌ఎస్‌సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ వైరస్ అనేది పెంపుడు జంతువుల నుంచి మనషులకు, ఇతర జంతువులకు వ్యాప్తి చేస్తుందనటానికి ఎటువంటి ఆధారాలు లేవని బెల్జియం అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎవరైనా పెంపుడు జంతువులను తాకేముందు, తాకిన తర్వాత చేతులను శుభ్రంగా కడుకోవటం మంచిది. అంతేకాకుండా సామాజిక దూరాన్ని పాటించడం కూడా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.