House Collapse In Sea : షాకింగ్ వీడియో : రెండు అంతస్తుల భవనాన్ని సముద్రం ఎలా లాగేసుకుందో చూడండి!

అర్జెంటీనాలో ఓ రెండు అంతస్తుల భవనాన్ని సముద్రం లోపలికి లాగేసుకుంది. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సముద్ర మట్టం పెరిగిపోవడంతో భవన నిర్మాణం బలహీనపడి సముద్రంలోకి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

House Collapse In Sea : షాకింగ్ వీడియో : రెండు అంతస్తుల భవనాన్ని సముద్రం ఎలా లాగేసుకుందో చూడండి!

Caught On Camera Two Storey House Falls Collapses Into Sea

House Collapse In Sea : అర్జెంటీనాలో ఓ రెండు అంతస్తుల భవనాన్ని సముద్రం లోపలికి లాగేసుకుంది. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సముద్ర మట్టం పెరిగిపోవడంతో భవన నిర్మాణం బలహీనపడి సముద్రంలోకి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. జూలై 28న రాజధాని Buenos Aires‌లోని మార్ దెల్ ట్యుయూ నగరంలో ఈ ఘటన జరిగింది.

ఈ వీడియోలో సముద్రపు అలలు వేగంగా భవన గోడలను బలంగా తాకుతున్నట్టు కనిపిస్తోంది. అలల తాకిడికి భవనం కింది భాగమంతా సముద్రంలోకి ఒరిగిపోయింది. ఈ ఘటన సమయంలో ఆ భవనంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానిక నివేదికలు వెల్లడించాయి. వైరల్ అవుతున్న వీడియో ఇదే..