గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి, ఇండోర్ ర్లలో 6 అడుగుల దూరం సరిపోదు: CDC

గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి, ఇండోర్ ర్లలో 6 అడుగుల దూరం సరిపోదు: CDC

కరోనావైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆరు అడుగుల దూరం కూడా సరిపోదని U.S. Centers for Disease Control and Prevention (CDC) చెప్తుంది. బిజినెసెస్, స్కూల్స్ రీ ఓపెన్ తర్వాత న్యూ ఛాలెంజెస్ మొదలయ్యాయి. నాలుగు గోడల మధ్య అంతా కలిసి పనిచేయాల్సిన పరిస్థితి.

ఇలా ఉంటే వైరస్ ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తికి ఆరు అడుగుల దూరంలో కూర్చొని పనిచేస్తున్నా సేఫ్ కాదని చెప్తోంది (CDC). కరోనావైరస్ అనేది కొన్ని సార్లు చాలా చిన్న అణువుల రూపంలో గాలిలో ఇన్ఫెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సామాజిక దూరం పాటిస్తున్నామనుకుని ఆరు అడుగుల దూరం పాటిస్తే సరిపోదు.



వర్క్ ప్లేసుల్లో చాలా సోషల్ డిస్టెన్సింగ్ గైడ్ లైన్స్ పాటించాలి. రెస్టారెంట్లు, స్టోర్స్ లాంటి ప్రాంతాల్లో 1.8మీటర్లు అంటే 6అడుగుల దూరం కచ్చితంగా పాటించాలి. అలా చేయడం ద్వారా COVID-19 నుంచి దూరంగా ఉండగలం.

‘కొన్ని రిపోర్టుల ఆధారంగా అసాధారణ పరిస్థితుల్లోనూ COVID-19 వ్యాప్తి జరిగింది. ఇన్ఫెక్షన్ వ్యక్తి నుంచి ఆరు అడుగులు అంత కంటే తక్కువ దూరం ఉంటే రిస్కే. దీంతో ఈ రూల్ ను కూడా గైడెన్స్ లో యాడ్ చేయనున్నారు.

కొన్ని రోజులుగా అమెరికాలోని 34 రాష్ట్రాల్లో మహమ్మారి వ్యాప్తి వేగంగా ఉంది. అదే సమయంలో స్కూల్స్ రీ ఓపెన్ అవుతున్నాయి. ఫ్లోరిడా లాంటి రాష్ట్రాల్లో నిబంధనలు ఎత్తేసి రెస్టారెంట్లు, బిజినెస్ లు మొదలుపెట్టేశారు. అయితే అక్కడి వాతావరణం మరింత చల్లగా ఉండటంతో నాలుగు గోడల మధ్యే ఉండడానికి ప్రేరేపిస్తున్నారు.

ఆరు అడుగుల దూరం కంటే తక్కువగా కూర్చోవడం అవతలి వ్యక్తి దగ్గినా, తుమ్మినా, మాట్లాడినా నీటి తుంపర్లు గాలిలో ప్రయాణించి వైరస్ వ్యాప్తి చేస్తాయి. వైరస్ అణువులు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. వెంటిలేషన్ లేని సమయంలో ఒకరి నుంచి మరింత మందికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.