Water Restaurant : వెరైటీ రెస్టారెంట్.. తినాలంటే కాళ్ళు తడవాల్సిందే!

ఈ మధ్యకాలంలో రెస్టారెంట్లను వెరైటీగా డిసైన్ చేస్తున్నారు యజమానులు.కస్టమర్ల అభిరుచికి తగినట్లు రెస్టారెంట్లను తయారు చేస్తున్నారు.

Water Restaurant : వెరైటీ రెస్టారెంట్.. తినాలంటే కాళ్ళు తడవాల్సిందే!

Water Restaurant

Water Restaurant : ఈ మధ్యకాలంలో రెస్టారెంట్లను వెరైటీగా డిసైన్ చేస్తున్నారు యజమానులు. మరోవైపు కస్టమర్లు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. దీంతో కస్టమర్ల అభిరుచికి తగినట్లు రెస్టారెట్ల డిసైన్ చేస్తున్నారు. కొందరు చెట్లపై రెస్టారెంట్లను నిర్మిస్తే.. మరికొందరు నీటి అంతర్భాగంలో రెస్టారెంట్లను కట్టి ఔరా అనిపిస్తున్నారు. ఇక తాజాగా ఓ రెస్టారెంటును నది ఒడ్డున ఏర్పాటు చేశారు.

Read More :  ఎగ్జైటింగ్ జాబ్ : కూర రుచి చెప్పినందుకు నెలకు Rs.50 వేల జీతం

New Project (5)

ఆ రెస్టారెంట్‌కు వెళ్తే మోకాళ్ల లోతు వ‌ర‌కు నీళ్లు వ‌స్తాయి. ప్యాంటు త‌డ‌వాల్సిందే. అందుకే ఆ రెస్టారెంట్ స్పెష‌ల్ అయింది. అంద‌రూ ఇప్పుడు ఆ రెస్టారెంట్‌కు క్యూ క‌డుతున్నారు. ఇక ఈ రెస్టారెంట్ ఎక్కడుంది అనేగా మీ ప్రశ్న.. అక్కడికే వస్తున్నాం.. ఈ రెస్టారెంట్ థాయిలాండ్‌లో ఉంది. చావో ఫ్రాయా అనే నది ఒడ్డునే ఈ రెస్టారెంట్ ఉన్నది. దీని పేరు అంటిక్ రెస్టారెంట్.. థాయిలాండ్‌కి వచ్చిన టూరిస్టుల్లో చాలామంది చావో ఫ్రాయా నదిని సందర్శిస్తారు.

New Project (4)

Read More :  చీర కట్టుకురావద్దన్న రెస్టారెంట్ మూతపడనుంది

ఈ ప్రాంతంలో చాలా రెస్టారెంట్లు ఉంటాయి. కానీ నీటిలో ఉండే రెస్టారెంట్ మాత్రం ఇదొక్కటే. ఇక ఇది కొత్తగా ఉండటంతో చాలామంది పర్యాటకులు నీటిలో కూర్చొని తింటూ ఎంచక్కా ఎంజాయి చేస్తున్నారు. డైనింగ్ ఏరియాకు వ‌చ్చి అక్క‌డ కూర్చొని కింద కాళ్ల‌కు తాకుతున్న అల‌ల‌ను ఎంజాయ్ చేస్తూ ఫుడ్‌ను ఆర‌గిస్తున్నారు. క‌స్ట‌మ‌ర్లు కూడా వెరైటీ రెస్టారెంట్ న‌చ్చి అక్క‌డికి క్యూ క‌డుతున్నారు.