వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త ..వీధుల్లో పోస్టర్లు అంటించి రచ్చ చేసిన భార్య | cheating husband wife viral posters

వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త ..వీధుల్లో పోస్టర్లు అంటించి రచ్చ చేసిన భార్య

యూకేలోని ఓల్డ్‌ హోమ్‌కు చెందిన ఒక మహిళ తన భర్త తనకు చేసిన మోసానికి నడివీధుల్లో అతని పరువుని తూర్పారబట్టింది. పోస్టర్లు వేసి మరీ ఆగమాగం చేసిపారేసింది. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్‌ మీడియలో వైరల్‌ గా మారాయి. ఓల్డ్‌హోమ్‌కు చెందిన ఓ మహిళకు తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. ఆవేదనతో రగిలిపోయింది. ఎలాగైనా అతనికి బుద్ది చెప్పాలనుకుంది.

వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త ..వీధుల్లో పోస్టర్లు అంటించి రచ్చ చేసిన భార్య

cheating husband wife viral posters : యూకేలోని ఓల్డ్‌ హోమ్‌కు చెందిన ఒక మహిళ తన భర్త తనకు చేసిన మోసానికి నడివీధుల్లో అతని పరువుని తూర్పారబట్టింది. పోస్టర్లు వేసి మరీ ఆగమాగం చేసిపారేసింది. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్‌ మీడియలో వైరల్‌ గా మారాయి.

ఓల్డ్‌హోమ్‌కు చెందిన ఓ మహిళకు తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. ఆవేదనతో రగిలిపోయింది. ఎలాగైనా అతనికి బుద్ది చెప్పాలనుకుంది. చిర్రెత్తుకొచ్చి అతని పరువుని చిత్తడి చిత్తడి చేసిపారేసింది.

భర్త ఫోటోను ఏ4 సైజ్‌లో ప్రింట్‌ తీయించింది. ఆ చుట్టు పక్కల గోడలతో పాటు కార్లు, చెట్లు ఇలా ఏది కనిపిస్తే వాటిని ఆ ఫోటోల పోస్టర్లు అంటించింది. ఆ పోస్టర్ల కింద ఇతనో మోసగాడు..అంటూ రాసింది. వాటిని గోడలు, చెట్లు, కార్లు, డస్ట్ బిన్స్ ఇలా వేటిని వదలకుండా అన్నిచోట్ల అతికించి తన కోపాన్ని..అతనిపై తనకు నిరసనను వెళ్లగ్రక్కింది. అలా చేశాక కాస్త మనశ్శాంతిగా అనిపించింది. అంతటితో ఆగలేదామె. మోసాలకు పాల్పడుతున్న మగాళ్ళను ఉద్దేశించి కూడా మరికొన్ని పోస్టర్లను గోడలకు అతికించింది.

‘మీ భార్యను మోసం చేస్తున్నారా? తొందర్లోనే మీ బండారం బయట పడుతొంది’ అంటూ కామెంట్లు రాసి మరీ హెచ్చరించింది. అలా మోసం చేసినవారి భార్యలను ఉద్దేశించి ‘ఈరోజు మీ భర్త మీతోనే ఉన్నాడా? నిన్నరాత్రి? గతవారం కూడా మీతోనే ఉన్నాడా?’ అంటూ రాసి కొత్త సందేహాలకు తెరలేపితూ ప్రచారం చేసింది.దీనికి సంబంధించి ఆ పోస్టర్ల ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా గతంలో ఎమిలీ అనే యువతి కూడా తన ప్రేమికుడు చేసిన మోసాన్ని ఎండగడుతూ..మోసం చేసిన లవర్ గది చుట్టూ పోస్టర్లను అతికించి నిరసన తెలిపింది.

×