‘చీజ్డ్ ఛాలెంజ్’:చిన్నారుల ముఖాలపై చీజ్ కొడుతూ..పైశాచికత్వం 

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 10:46 AM IST
‘చీజ్డ్ ఛాలెంజ్’:చిన్నారుల ముఖాలపై చీజ్ కొడుతూ..పైశాచికత్వం 

‘చీజ్డ్ ఛాలెంజ్’ పేరుతో ముఖాలపై చీజ్ కొట్టుకునే ట్రెండ్ మొదలైంది. పిల్లల ముఖాలపై అకస్మాత్తుగా చీజ్ కొట్టి వారి ఎక్స్‌ప్రెషన్ వీడియో తీయడమే ఈ ఛాలెంజ్. పిచ్చి పలు రకాలంటారు పెద్దలు..ఊరికనే అనలేదు ఈ మాటలు.  ఇందులో ఈ చీజ్డ్ చాలెంజ్ కూడా ఒకటి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఇటీవల రకరకాల ఛాలెంజ్‌లు ట్రెండవుతున్న సంగతి తెలిసిందే. ఐస్ బకెట్, కికీ వంటి ఛాలెంజ్‌లు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. తాజాగా చీజ్డ్ ఛాలెంజ్’.
Also Read : అభినందన్ దేశభక్తి : డిశ్చార్జ్ చేయండి.. విధుల్లో చేరాలి

ఈ ఛాలెంజ్‌ను @unclehxlmes అనే ట్విట్టర్ యూజర్ ముందుగా మొదలుపెట్టాడు. అతను ఛాలెంజ్ చేసే ఉద్దేశం కాకుండా దీన్ని మొదలుపెట్టడం గమనార్హం. తన తమ్ముడు ముఖం మీద చీజ్ కొడితే ఎలా స్పందిస్తాడో చూడాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి ట్వీట్ చేశాడు. దీంతో అదికాస్తా  వైరల్‌గా మారింది. సుమారు ఐదు మిలియన్ పైగా ఈ వీడియోను నెటిజన్లు వీక్షించారు. ప్రస్తుతం ఆ వీడియోను అతను తీసివేసినా..ఇప్పటికే అది చూసివారు మాత్రం దాన్ని ఛాలెంజ్‌గా స్వీకరించి తమ పిల్లలపై ‘చీజ్‌’తో దాడి చేస్తున్నారు. 
Also Read : పాక్ కు బుద్ధి చెప్పాల్సిందే : ఐరాస వద్ద నిరసల హోరు

అమాయకమైన చిన్నారుల ముఖాలపై చీజ్‌తో కొడుతూ ఆనందిస్తున్నారు. ఈ ఛాలెంజ్‌పై నెటిజన్ల భిన్నంగా రెస్పాండ్ అవుతున్నారున. కొందరు వినోదంగా భావిస్తుంటే..మరికొందరు సీరియస్‌గా తీసుకుంటున్నారు. చిన్నారుల ముఖం మీద చీజ్‌తో కొట్టడం మంచి పద్ధతి కాదని..అది వారి కంటికి తగిలితే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. చిన్నారులను ఎందుకు అలా వేధిస్తున్నారంటూ ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తమ ఇంట్లోని పెంపుడు కుక్కలను, పెద్దవాళ్లను కూడా చీజ్‌తో ముఖంపై కొడుతూ ఛాలెంజ్‌ విసురుతున్నారు. మరి.. ఈ ‘చీజ్డ్ ఛాలెంజ్’ వెర్రి ఎంత దూరం పాకుతుందో చూడాలి. 
 
 

Also Read : అభినందన్ అరుదైన రికార్డ్ : F-16 కూల్చిన తొలి IAF కమాండర్
Also Read : అభినందన్ తరహా మీసం, హెయిర్ స్టైల్ పై యువత ఉత్సాహం