UN Report : 2021లో పుట్టిన పిల్ల‌ల‌కు ముప్పు..30 ఏళ్లకే ఆరోగ్య సమస్యలు..కోటిమంది చిన్నారులకు పౌష్టికాహార లోపం

పర్యావరణంలో వస్తున్న పెను మార్పులతో రాబోయే తరాలవారికి పెను ప్రమాదం తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పర్యావరణంలో వచ్చిన మార్పులు రానున్న దశాబ్దాల్లో పౌష్టికాహార లోపం, అంటురోగాలు, సాగునీరు ఎలా ఉన్నా తాగునీటి కొర‌త సర్వసాధారణంగా మారిపోతాయని యునైటెడ్ నేష‌న్స్ ఇంట‌ర్‌గ‌వ‌ర్న‌మెంట‌ల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) నివేదికలో వెల్లడైంది.

UN Report : 2021లో పుట్టిన పిల్ల‌ల‌కు ముప్పు..30 ఏళ్లకే ఆరోగ్య సమస్యలు..కోటిమంది చిన్నారులకు పౌష్టికాహార లోపం

Children Born In 2021 Will Face Climate Health Threats (1)

Children born in 2021 will face climate-health threats : పర్యావరణంలో వస్తున్న పెను మార్పులతో రాబోయే తరాలవారికి పెను ప్రమాదం తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పర్యావరణంలో వచ్చిన మార్పులు రానున్న దశాబ్దాల్లో పౌష్టికాహార లోపం, అంటురోగాలు, సాగునీరు ఎలా ఉన్నా తాగునీటి కొర‌త సర్వసాధారణంగా మారిపోతాయని యునైటెడ్ నేష‌న్స్ ఇంట‌ర్‌గ‌వ‌ర్న‌మెంట‌ల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) నివేదికలో వెల్లడైంది.

‘మనం చేసిన పాప పుణ్యాలు కొలిచి పిల్లల ఒడిలో పోస్తాడు భగవంతుడు’ అని పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుతం మన అలవాట్లు…చేస్తున్న పనులు..పర్యావరణానికి చేస్తున్న హానీ రాబోయే తరలమీద పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. దానికి తగిన చర్యలు తీసుకోవాలి. లేదంటే రాబోయే తరాలవారు పెను ప్రమాదంలో పడకతప్పదని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు.

ఇన్ని హెచ్చరికలు వినిపిస్తూ..నిపుణులు పదే పదే మొత్తుకుంటున్నా మన జీవనశైలిని మార్చుకోవటంలేదు. ప్ర‌పంచం ప‌రిస్థితి చూస్తుంటే రానున్న తరాల బ‌తుకుల దుర్భ‌రం చేసేలాగానే ఉన్నాయి. ఈ మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అందుకే ప్రకృతి విపత్తులు తలెత్తుతున్నాయి. అయినా మనిషి మాత్రం మారటంలేదు. ఈ మాట చెబుతున్న‌ది ఎవ‌రో కాదు.. సాక్షాత్తూ ఐక్య రాజ్య స‌మితే చెబుతోంది. హెచ్చరిస్తోంది. పలు సూచనలు చేస్తోంది.అయనా ప్రపంచ దేశాలు పద్ధతుల్లో మార్పు రావటంలేదు. యునైటెడ్ నేష‌న్స్ ఇంట‌ర్‌గ‌వ‌ర్న‌మెంట‌ల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) నివేదిక చాలా ఆందోళ‌న క‌లిగించేలా ఉంది. రానున్న ద‌శాబ్దాల్లో ఎలాంటి దారుణ‌మైన ప‌రిస్థితులను మ‌నం, మ‌న త‌ర్వాతి త‌రాలు చూడ‌బోతున్నామో ఈ రిపోర్ట్ క‌ళ్ల‌కు క‌ట్టింది.

విధానాలు మార్చాల్సిందే..లేదంటే పెను ముప్పు తప్పదు
ఐపీసీసీ దీనికి సంబంధించి 4,000 పేజీల నివేదిక‌ను త‌యారు చేసింది. వ‌చ్చే సంత్సరం ఈ నివేదిక అధికారికంగా ఇది రిలీజ్ కానున్న ఈ నివేదికను ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ ఈ ముసాయిదా నివేదిక వివ‌రాల‌ను వెల్ల‌డించింది. రానున్న ద‌శాబ్దాల్లో ప‌ర్యావ‌ర‌ణంలో క‌లిగే మార్పుల వ‌ల్ల ఎంత‌టి తీవ్ర విప‌త్తులు సంభ‌వించ‌బోతున్నాయో తెలిపే నివేదిక ఇది. పౌష్టికాహార లోపం, అంటురోగాలు, తాగునీటి కొర‌త వంటివి సాధార‌ణంగా మారిపోతాయ‌ని ఈ రిపోర్ట్ స్ప‌ష్టం చేస్తోంది. ప్ర‌స్తుత విధానాల్లో మార్పుల‌తో జ‌రిగే న‌ష్టాన్ని కాస్త‌యినా త‌గ్గించ‌వ‌చ్చ‌ని సూచించింది.

నీరు లేకపోతే పంటలు పండవనే విషయం తెలిసిందే. ఈక్రమంలో నీటి కొరతతో పంట‌ల పండవు..పండినా ఆ పంటలో ఎటువంటి పోషకాహారాలు ఉండవు. దీంతో జనాల్లో ముఖ్యంగా చిన్నారుల్లో పోష‌కాల లేమి ఏర్పడితుంది. తద్వారా పలు ఆరోగ్య సమస్యలకు గురవుతారని ఈ రిపోర్ట్ హెచ్చ‌రించింది. ముఖ్యంగా 2021లో పుట్టిన పిల్ల‌లు వారి 30వ సంవత్సరం వచ్చేసరికి..2050లో తీవ్ర‌మైన ప‌ర్యావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల క‌లిగే ఆరోగ్య సంబంధిత స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని ఈ రిపోర్ట్ చెప్పే వాస్తవాలు ఆందోళ‌న కలిగిస్తున్నాయి. 2050నాటికి ప్రస్తుతం ఇప్పుడున్న వారికి అద‌నంగా మ‌రో 8 కోట్ల మంది ఆక‌లి ముప్పును ఎదుర్కోవ‌చ్చ‌నీ అంచనా వేసిందీ రిపోర్టు.

పర్యావరణంలో వస్తున్న మార్పులు..నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌ల వ‌ల్ల పంట‌ల దిగుబ‌డి త‌గ్గిపోతోంది. ఇది ప్రతీ ఏడాది పెరుగుతోంది. అంతేకాదు ఈ ఉష్ణోగ్ర‌త‌లు వాటిలోని పోష‌కాల స్థాయిలు తగ్గిపోతున్నాయి. ఈక్రమంలో రానున్న ద‌శాబ్దాల్లో వ‌రి, గోధుమ‌, బార్లీ, ఆలుగ‌డ్డ‌లు వంటి పంట‌ల్లో ప్రొటీన్ స్థాయి 6-14 శాతం త‌గ్గ‌నున్న‌ట్లు ఐపీసీసీ రిపోర్ట్ లో తేలింది. దీనివ‌ల్ల మ‌రో 15 కోట్ల మంది ప్రొటీన్ లోపంతో బాధ‌ప‌డే ప్ర‌మాదం ఉన్న‌ట్లుగా అంచ‌నా వేసింది. 2050 నాటికి ఆఫ్రికా, ఆసియాల్లోని మ‌రో కోటి మంది పిల్ల‌లు పౌష్టికాహార లోపంతో బాధ‌ప‌డ‌తారని వెల్లడించింది.

కొత్త కొత్త రోగాలతో మరింత ప్రమాదం..
ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచ‌మంతా అత‌లాకుత‌లం అవుతోంది. ఇప్పటికే ఈ కరోనా మహమ్మారిని ఖతం చేయటానికి ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయి. పలు రకాల వ్యాక్సిన్లు కనిపెట్టాయి. కానీ కరోనా ఎప్పటికి పోతుందో తెలియని పరిస్థితి.ఫస్ట్,సెకండ్ వేవ్ లతో ఇప్పటికే ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలియపోయాయి. అలాగే కరోనా సోకి పలు రకాల సైడ్ ఎఫెక్ట్ లతో బాధపడేవారు ఇంకెందరో..ఇవి దీర్ఘకాలిక వ్యాదులుగా మారే అవకాశాలున్నాయని కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో రానున్న ద‌శాబ్దాల్లో ఉష్ణోగ్ర‌త‌లు మరింతగా పెరిగిపోవ‌డం, త‌ద్వారా దోమ‌ల సంఖ్య పెర‌గ‌డం వ‌ల్ల‌ ప్ర‌పంచంలోని 50 శాతం జ‌నాభా డెంగ్యూ, జికా వైర‌స్‌, యెల్లో ఫీవ‌ర్ వంటి రోగాల బారిన ప‌డే ప్ర‌మాదం ఉన్న‌ట్లు ఈ రిపోర్ట్ తెలిపింది. ఇవి కాకుండా ఇంకా పలు భయంకరమైన పరిస్థితులక గురవ్వ వచ్చని..కాబట్టి ఇకనైనా పర్యావరణ హాని కలిగిచే పనులు మానుకోవాలని సూచించింది.