Chimpanzee Hugs : కాపాడినవారిని కౌగలించుకుని ధన్యవాదాలు తెలిపిన చింపాంజీ

ఓ చింపాంజీ తన ప్రాణాలు కాపాడివారిని కృతజ్ఞతలు చెప్పిన విధానం చూస్తే..మనుషుల్లో కూడా ఇంతటి కృతజ్ఞతాభావం ఉండదేమో అనిపిస్తుంది. వేటగాళ్ల బోనులో చిక్కుకునన చింపాంజీ తనను కాపాడినవారిని కౌగలించుకుని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Chimpanzee Hugs : కాపాడినవారిని కౌగలించుకుని ధన్యవాదాలు తెలిపిన చింపాంజీ

Chimpanzee Hugs

Chimpanzee Hugs : మనకు సహాయం చేసినవారికి కష్టాల్లో ఆదుకున్నవారికి ధన్యవాదాలు చెబుతాం. నోరు లేని మూగ జీవాలు కూడా తమ ప్రాణాలు కాపాడినవారికి..తమ దాహం తీర్చినవారికి తమకు ఆహారం పెట్టి కడుపు నింపినవారి పట్ల కృతజ్ఞతలు తెలిపిన పలు సందర్భాల గురించి సోషల్ మీడియాలో విన్నాం..చూశాం. ఇదిగో అటువంటిదే. ఓ చింపాంజీ తనను కాపాడివారిని కృతజ్ఞతలు చెప్పిన విధానం చూస్తే..మనుషుల్లో కూడా ఇంతటి కృతజ్ఞతాభావం ఉండదేమో అనిపిస్తుంది. ఓ చింపాంజీ తనను కాపాడినవారిని కౌగలించుకుని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫారెస్ట్ ఆఫీసర్ సుధా రామెన్ తన ట్విట్టర్ లో ఈ వీడియోను షేర్ చేసారు.

జంతు సంక్షేమం గురించి అధ్యయనాలు చేసే పటాలజిస్ట్ జేన్ గూడాల్‌ బృందం వేటగాళ్లు పన్నిన ఉచ్చులో పడిన ఓ చింపాంజీని కాపాడారు. దాన్ని బోనునుంచి విడుదల చేయగానే అది నాలుగైదు అడుగులు వేసి వెళుతూండగా గూడాల్‌ బృందంలోని ఓ మహిళ హాయ్ అంటూ దాన్ని పలుకరించగా అది భావోద్వేగానికి గురైంది. ఆమె దగ్గరకొచ్చి ఆమె ఒడిలో కూర్చుని ధన్యవాదాలు తెలిపింది. ఆ తరువాత జేన్ గూడాల్ ను కౌగలించుకుని భావోద్వేగానికి గురైంది. ఆమెను గట్టిగా హత్తుకుంది. తన భావాలను ఆమెకు తెలిపింది. జేన్ ఆమె చింపాంజీని హత్తుకుని దాని వెన్ను నిమిరారు. దానికి ఆ మూగ ప్రాణి తెగ ఆనందపడిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కాగా 87 సంవత్సారాల జేన్ గూడాల్ చింపాంజీలపై అధ్యయం చేశారు. చింపాంజీలకు అమే సాక్షాత్తు అమ్మే. చింపాంజీల జీవన విధానంపై 60 ఏళ్లు అధ్యయనం చేసిన వ్యక్తిగా జేన్ గూడాల్ పేరొందారు.1960 లో ఆమె టాంజానియాలోని గొంబే స్ట్రీమ్ నేషనల్ పార్కును సందర్శించింది చింపాంజీలలో మనుషుల్లా వ్యవహరించే తీరును పరిశీలించి అప్పటినుంచి అధ్యయం చేయటం ప్రారంభించారు. చింపాంజీల పరిరక్షణ కోసం..జంతు సంక్షేమం కోసం ఆమె విస్తృతంగా పనిచేశారు. ఇప్పటికీ చేస్తునే ఉన్నారు. దాంట్లో భాగంగానే ఓ అడవిలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చింపాంజీని రక్షించారు. అలా తనను కాపాడిన జేన్ గూడాల్ ను హత్తుకుని భావోద్వేగానికి గురైందా చింపాంజీ.