Solomon Islands : సాల్మన్ ఐలాండ్ వద్ద చైనా ఆర్మీ స్థావరం!

సైనిక స్థావరం ఏర్పాటు చేయడంపై ఆందోళన వ్యక్తమౌతోందని, ఈ విషయాన్ని సాల్మన్ ఐలాండ్స్ కు తెలియచేయడం జరుగుతుందని ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి పీటర్ డుట్టన్ వెల్లడించారు.

Solomon Islands : సాల్మన్ ఐలాండ్ వద్ద చైనా ఆర్మీ స్థావరం!

China (1)

China And Solomon Islands : డ్రాగన్ కంట్రీ భారతదేశం వైపే కాకుండా.. ఇతర దేశాల వైపు చూస్తోంది. భారతదేశ వాస్తవాధీన రేఖ ప్రాంతాల్ల బలగాలు మోహరించడంపై భారత్ తీవ్రంగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. మరొక వార్త హల్ చల్ చేస్తోంది. ఆస్ట్రేలియాకు అత్యంత సమీపంలో చైనా ఆర్మీ స్థావరం ఏర్పాటు చేసుకుందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై ఆస్ట్రేలియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనికంతటికి కారణం చైనా – సాల్మన్ ఐలాండ్స్ కు మధ్య జరిగిన ఒప్పంద పత్రం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read More : India-China: భారత్ చేరుకున్న చైనా విదేశాంగ మంత్రి: గాల్వాన్ సహా ఇతర అంశాలపై చర్చ

ఇలాంటి పరిణామాలు ఆందోళనకరమని వెల్లడించింది. ఇటీవలే ఓ చైనా నౌక ఆస్ట్రేలియాలోని ఉత్తరం వైపు ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్ లోకి ప్రవేశించడం సంచలనం సృష్టించింది. తాజాగా జరుగుతున్న పరిణామాలను ఆస్ట్రేలియా నిశితంగా పరిశీలిస్తోంది. సైనిక స్థావరం ఏర్పాటు చేయడంపై ఆందోళన వ్యక్తమౌతోందని, ఈ విషయాన్ని సాల్మన్ ఐలాండ్స్ కు తెలియచేయడం జరుగుతుందని ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి పీటర్ డుట్టన్ వెల్లడించారు. ఏది ఏమైనా ఈ ద్వీపానికి సంబంధించిన భద్రతను ఆస్ట్రేలియా చూసుకుంటుందని స్పష్టం చేశారు.

Read More : China on India: భారత్‌పై చైనా అక్కసు..!

క్వాడ్ కూటమిలో ఆస్ట్రేలియా కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. క్వాడ్ కూటమిపై చైనా అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు కలిసి క్వాడ్ (QUAD) కూటమిగా ఏర్పడడాన్ని డ్రాగన్ దేశం తప్పుబడుతోంది. ఈ క్రమంలో… సాల్వన్ ద్వీపం 2019 నుంచి తైవాన్ నుంచి విడిపోయి చైనా వంచన చేరింది. ప్రస్తుతం చైనాతో ఒప్పందానికి సంబంధించిన పత్రం గురించి సాల్మన్ ఐలాండ్స్ మంత్రివర్గం పరిశీలనకు వెళ్లనుంది. ఈ ఒప్పందం ఒకే అయితే.. చైనా నౌకలు ఆస్ట్రేలియా తీరానికి అత్యంత సమీపంలోకి వెళ్లడానికి అవకాశాలు ఏర్పడుతాయి. చైనా పోలీసులు, ఇతర సిబ్బంది ని పంపాలని కోరే ఛాన్స్ లు కూడా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై ఆస్ట్రేలియా ఆందోళన వ్యక్తం చేస్తోంది.