China approves : మూడు నుంచి ఏడేళ్ల పిల్లలకు వ్యాక్సిన్

మెజారిటీ దేశాలు టీకాల కొరతను ఎదుర్కొంటున్నాయి. వయస్సుల వారీగా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న క్రమంలో చైనాలో మాత్రం చిన్నారులకు కూడా కరోనా టీకా వేయటానికి సిద్ధమైంది, దీంట్లో భాగంగా చైనాలో మూడేళ్ల పిల్లల నుంచి ఏడు ఏళ్ల పిల్లల వరకూ కరోనా టీకా వేయటాని రెడీ అవుతోంది.

China  approves : మూడు నుంచి ఏడేళ్ల పిల్లలకు వ్యాక్సిన్

China 3 To 7 Years Age Vac

China approves vaccine for 3 to 7 age Childrens : చైనా నుంచి ప్రపంచ దేశాలకు పాకిన కరోనా మహమ్మారిని ఖతం చేయటానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా కొనాసాగుతోంది. కొన్ని దేశాలు ఇప్పటికీ ప్రజలకు వ్యాక్సిన్ వేయటానికి సతమతమవుతున్నాయి. మెజారిటీ దేశాలు టీకాల కొరతను ఎదుర్కొంటున్నాయి.వయస్సుల వారీగా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న క్రమంలో యువతకు కూడా వ్యాక్సినషన్ జరుగుతోంది కొన్ని దేశాల్లో. కానీ చిన్నారులకు మాత్రం ఇంకా వ్యాక్సిన్ మొదలు కాలేదనే చెప్పాలి. కానీ చైనాలో మాత్రం చిన్నారులకు కూడా కరోనా టీకా వేయటానికి సిద్ధమైంది డ్రాగన్ దేశం.దీంట్లో భాగంగా చైనాలో మూడేళ్ల పిల్లలక కూడా కరోనా టీకా వేయటాని రెడీ అవుతోంది.

చిన్నారులకు కూడా టీకా వేయానికి సిద్ధమవుతున్న చైనా సినోవాక్‌ సంస్థ రూపొందించిన కరోనావాక్‌ టీకాను వేయటానికి అన్ని ఏర్పాట్టు చేసుకుంటోంది. కరోనావాక్‌ టీకాను అత్యవసర వినియోగానికి చైనా రెగ్యులేటరీ సంస్థలు ఆమోదం తెలిపాయి. దీంట్లో భాగంగా 3 నుంచి 7 సంవత్సరాల మధ్య వయసు వారికి ఈ టీకా అందించొచ్చని వెల్లడించాయి. కరోనావాక్‌ మొదటి దశ రెండో దశ క్లినికల్‌ పరీక్షల ప్రయోగాలు పూర్తయ్యాయి. వ్యాక్సిన్ వేయించుకున్న పెద్దవాళ్లకు వారి శరీరంలో యాంటాబాడీలను ఎలా ఉత్పత్తి అవుతాయో..చిన్నారుల్లో కూడా వ్యాక్సిన్ వేయిచుకున్న తరువాత వారి శరీరంలో యాంటీబాడీలు అలాగే ఉత్పత్తి అవుతాయని కరోనా నుంచి కాపాడుకునే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వెల్లడించారు.

వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కరోనా నుంచి కాపాడే సామర్థ్యం చిన్నారులకు కలుగుతుందని దీంతో థర్డ్ వేవ్ నుంచి చిన్నారుల్ని కాపాడుకోవచ్చని తెలుస్తోంది. జూన్‌ 1న కరోనావాక్‌ వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. చైనా రూపొందించిన మరో వ్యాక్సిన్‌ సైరోఫార్మ్‌కు ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో అనుమతి లభించింది. కాగా చైనా ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు 763 మిలియన్ల మోతాదుల వ్యాక్సిన్లను అందించింది.