బీబీసీ న్యూస్ బ్యాన్ చేసిన చైనా

బీబీసీ న్యూస్ బ్యాన్ చేసిన చైనా

BBC in China: చైనా ప్రభుత్వం.. తమ దేశంలో బీబీసీ న్యూస్ టెలికాస్ట్ అవడానికి వీల్లేదంటూ నిషేదం విధించింది. చైనాలో బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ రద్దు చేసిన వారానికే ఈ నిర్ణయం తీసుకుంది. నేషనల్ రేడియే అండ్ టెలివిజన్ అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం అర్ధరాత్రి ఈ మేర స్టేట్మెంట్ విడుదల చేసింది. చైనా న్యూస్ కవరేజ్ చేయడంలో బీబీసీ వరల్డ్ న్యూస్ రూల్స్ అతక్రమించిందని చెప్పుకొచ్చింది.

పర్యటనకు వచ్చిన విదేశీయులు చూసేందుకు చైనా ప్రాంతానికి బయట ఉన్న హోటల్స్ లో బీబీసీను వీక్షించే వీలుంది. నిషేదం విధించిన వెంటనే ఈ సర్వీసును తొలగించలేదు. కొవిడ్ 19పై రీసెంట్ గా బీబీసీ ఇచ్చిన రిపోర్టు కరెక్ట్ గా లేదంటూ చైనా ప్రభుత్వం విమర్శలకు దిగింది. అంతేకాకుండా జిన్ జియాంగ్ ప్రాంతంలో బాలకార్మికులను, లైంగిక వేధింపులు విచ్ఛలవిడిగా జరుగుతున్నాయంటూ ప్రచారం చేసిందని ఆరోపించింది.

విదేశీ ఛానెల్ గా బీబీసీ పరిమితులు దాటి బ్రాడ్ కాస్టింగ్ చేసిందని రేడియో అండ్ టెలివిజన్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. దాంతో పాటే వచ్చే ఏడాది బీబీసీ బ్రాడ్‌కాస్ట్ అప్లికేషన్ కచ్చితంగా అంగీకరించేది లేదని వెల్లడించింది. దీనిపై స్పందించిన యూకే విదేశాంగ సెక్రటరీ డామినిక్ రాబ్.. ఇది అనుమతించదగ్గ నిర్ణయం కాదు. మీడియా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారు. ఇలా చేస్తేనే ప్రపంచం కళ్ల ముందు చైనా రెప్యూటేషన్ తగ్గిపోతుందని తెలుసుకోవడం లేదు.