ఇండియా పంది మాంసం వద్దంటున్న చైనా

  • Published By: madhu ,Published On : May 29, 2020 / 01:49 AM IST
ఇండియా పంది మాంసం వద్దంటున్న చైనా

చైనాలో కరోనా ఫీవర్ ఇంకా నెలకొంది. ఈ దేశం నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడించింది. ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షల సంఖ్యలో వైరస్ బారిన పడ్డారు. ఇంకా వ్యాక్సిన్ మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. దీంతో చైనా దేశంపై ఆగ్రహంగా ఉన్నాయి పలు దేశాలు. ఆ దేశంపై పలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా భారత్ నుంచి దిగుమతి చేసుకొనే పంది మాంసం వద్దని వెల్లడించింది. పందుల మాసం దిగుమతులపై నిషేధం విధించడానికి చైనా సిద్ధమైందని ఆ దేశ ప్రభుత్వాధికారి వెల్లడించారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ASF) కు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. 

పందులు, అడవి పందుల సంబంధిత ఉత్పత్తులపై నిషేధం విధిస్తే..తమ దేశ పశువులను సంరక్షించినట్లు అవుతుందని చైనా భావిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం భారత్, చైనా మధ్య లద్దాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. భారతదేశ సరిహద్దులోని అసోంలో ASF వ్యాధి కారణంగా 14 వేల పందులను చంపేశారు. ఈ వ్యాధి మొదట చైనాలో 2018, ఆగస్టులో సంభవించిందని టాక్. సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలపై చైనా విదేశాంగ స్పందించింది. ఇరు దేశాలు చేసుకున్న ఒప్పందాలను ఖచ్చితంగా పాటిస్తున్నామని వెల్లడించింది. 

2017లో డోక్లాం తరహా వివాదానికి దారితీసే అవకాశాలున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే చైనా..2000 నుంచి 2500 మంది సైనికులను సరిహద్దుకు చేర్చినట్లు తెలుస్తోంది. ఇటు భారత్ కూడా..వివాదాస్పదంగా ఉన్న పాంగాంగ్, గాల్వన్ ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ వెంట బలగాలను పెంచుకున్నట్లు సమాచారం. మే 05వ తేదీన పాంగాంగ్ ప్రాంతాల్లో ఇరు దేశాల సైనికులు తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రెండు వైపుల సైనికులకు తీవ్రగాయాలయ్యాయి. 

Read: మళ్లీ మధ్యవర్తిత్వం : భారత్-చైనా సరిహద్దు వివాదం పరిష్కరిస్తా…ట్రంప్