Covid In China : చైనాలో మళ్లీ కరోనా ..! వారానికి 65 మిలియన్ కేసులు అంచనా ..

చైనాలో మరోసారి కోవిడ్ మహమ్మారి ఆందోళన కలిగిస్తోంది. కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెంది భయపెడుతోంది. దీంతో అధికారులు మరోసారి అప్రమత్తమయ్యారు.

Covid In China : చైనాలో మళ్లీ కరోనా ..! వారానికి 65 మిలియన్ కేసులు అంచనా ..

Covid In china

China Covid   : చైనాలో మరోసారి కోవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్లుగా ఆందోళన కలిగిస్తోంది. వారానికి 65మిలియన్ల కొత్త కేసులు వెలుగులోకి వస్తాయని అధికారులు అంచనావేస్తున్నారు. దీంతో అధికారులు మరోసారి అప్రమత్తమై పరీక్షలు, టీకాలతో బిజి అయ్యారు. చైనా నుంచి కోవిడ్ ప్రపంచ దేశాలకు వ్యాపించి అన్ని దేశాలను వణికించింది. కానీ దేశాలన్నీ కోలుకున్నా చైనాను మాత్రం కోవిడ్ పూర్తిగా వదల్లేదు. దీంతో జీరో కోవిడ్ పాలసీతో డ్రాగన్ దేశం ఆంక్షలు విధించించింది. ఈ పాలసీని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినా ఏమాత్రం ఖాతరు చేయలేదు ప్రభుత్వం. కానీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటం..ఆంక్షలను అతిక్రమించి వీధుల్లోకొచ్చి ప్రజలు తమ నిరసనలను పలు రకాలుగా ప్రదర్శించారు.దీంతో ప్రభుత్వం ఆపాలసీని స్వస్తిపలికింది.

దీంతో చైనా వాసులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరోసారి డ్రాగన్ దేశంలో కోవిడ్ మహమమ్మారి విజృంభిస్తోంది. దీంతో..కరోనాను నియంత్రించటానికి అధికారులు టీకాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. జూన్‌లో కరోనా వేవ్ తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. దీంట్లో భాగంగా వారానికి 65 మిలియన్ కొత్త కేసులు వెలుగుచూస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. జీరో కోవిడ్ పాలసీని ఎత్తివేశాక తిరిగి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం చైనా కొత్త వేరియంట్ల వారీగా టీకాలను సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, చైనాలోని మూడు కొత్త వేరియంట్లను(XBB 1.9.1, XBB 1.5, XBB 1.16) అడ్డుకునే టీకాలకు ప్రాథమిక అనుమతి ఇచ్చామని గ్వాంగ్జోలో జరిగిన బయోటెక్ కంపెనీల సమావేశంలో ఆయన ప్రసంగిస్తు ప్రముఖ చైనా అంటువ్యాధుల నిపుణుడు జాంగ్ నాన్షాన్ సోమవారం (మే22,2023) తెలిపారు. కోవిడ్ అణచివేతకు త్వరలోనే మరో మూడు నాలుగు టీకాలకు కూడా త్వరలో అనుమతులు రాబోతోందని తెలిపారు.

2022లోలో మరి ముఖ్యంగా శీతాకాలంలో చైనా జీరో కొవిడ్ పాలసీ పేరిట విధించిన కఠిన ఆంక్షలను ప్రజల తీవ్ర వ్యతిరేకతతో ప్రభుత్వం ఎత్తివేసింది. ఫలితంగా అప్పట్లో ఒక్కసారిగా జనాభాలో 85 శాతం మంది కరోనాకు గురయ్యారు. అయినా ఇదేదో సర్వసాధారణంగా మారిపోయింది దీనికి భయపడుతు కూర్చోలేం అన్నట్లుగా చైనావాసులు జీరో కోవిడ్ పాలసీని తీవ్రంగా వ్యతిరేకించారు.దీంతో పలుప్రాంతాల్లో కోవిడ్ కేసులు వ్యాపించాయి.

కోవిడ్ అనగానే ఠక్కున గుర్తుకొచ్చే దేశం చైనా. ఆ దేశంలోని ఊహాన్ లో పుట్టిన కరోనా మహమ్మారి యావత్ ప్రపంచానికి వ్యాపించి వణికించింది. ఈ మహమ్మారి బారి నుంచి ప్రపంచ దేశాలు కోవిడ్ నుంచి బయటపడ్డాయి. అయినా చైనాలో మాత్రం పూర్తిగా సమసిపోలేదు. ఎక్కడోచోటు కొత్త కేసులు వెలుగులోకి రావటంతో జరగుతుండేది. దీంతో ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసితో తీవ్రమైన ఆంక్షలు విధించింది. కేసులు ఎక్కువగా నమోదు అయిన ప్రాంతాల్లో లాక్ డౌన్లు కూడా విధించింది. ఏళ్లకేళ్లుగా కోవిడ్ పేరుతో లాక్ డౌన్లలో మగ్గిపోవటంతో లాక్ డౌన్ అనే మాటలే హడలిపోయే పరిస్థితి నెలకొంది చైనా వాసుల్లో.

దీంతో ప్రభుత్వం విధించిన జీరో కోవిడ్ పాలసీని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం కోవిడ్ ను పూర్తిగా అంతమొందించటానికి ఎన్ని యత్నాలు చేసిన చైనాలో ఏదోక ప్రాంతంలో ఈ కోవిడ్ కేసులు వెలుగులోకి వస్తునే ఉన్నాయి. ఈక్రమంలో మరోసారి కోవిడ్ కేసుల భయం నెలకొంది.