భలే పనైందిరా బుడ్డోడా : ఫోన్ చూస్తూ టాయిలెట్‌లో ఇరుక్కున్నాడు

మొబైల్ ఫోన్.. అందరి ప్రపంచం ఇదే. పిల్లలు, పెద్దలు ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్.. ఇప్పుడు కామన్ అయిపోయింది. పిల్లాడు ఫోన్ ఇస్తేనే అన్నం తినే పరిస్థితి. నిద్రపోయినా.. లేచినా పక్కన ఫోన్ ఉండాల్సిందే.

  • Published By: sreehari ,Published On : March 7, 2019 / 01:05 PM IST
భలే పనైందిరా బుడ్డోడా : ఫోన్ చూస్తూ టాయిలెట్‌లో ఇరుక్కున్నాడు

మొబైల్ ఫోన్.. అందరి ప్రపంచం ఇదే. పిల్లలు, పెద్దలు ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్.. ఇప్పుడు కామన్ అయిపోయింది. పిల్లాడు ఫోన్ ఇస్తేనే అన్నం తినే పరిస్థితి. నిద్రపోయినా.. లేచినా పక్కన ఫోన్ ఉండాల్సిందే.

మొబైల్ ఫోన్.. అందరి ప్రపంచం ఇదే. పిల్లలు, పెద్దలు ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్.. ఇప్పుడు కామన్ అయిపోయింది. పిల్లాడు ఫోన్ ఇస్తేనే అన్నం తినే పరిస్థితి. నిద్రపోయినా.. లేచినా పక్కన ఫోన్ ఉండాల్సిందే. బజారుకు వెళ్లినా.. షాపింగ్ కు వెళ్లినా.. ఆఖరికి టాయిలెట్ రూంకు వెళ్లిన ఫోన్ వెంట ఉండాల్సిందే. భోజనం చేసే సమయంలో కూడా ఫోన్ చూస్తూ భుజించాలి. లేదంటే… ముద్ద లోపలికి దిగదు.
Also Read : ఆల్ ఇన్ వన్ : వాట్సాప్ తరహాలో ఫేస్ బుక్ ప్రైవసీ ప్లాట్ ఫాం

కొంతమంది టాయిలెట్ రూంలోనే అన్ని పనులు కానేచ్చేస్తుంటారు. పెద్దలకే మొబైల్ వినియోగంపై కంట్రోల్ లేదు.. ఇక పిల్లలకేయితే చెప్పనక్కర్లేదు. ఈ తరం చిన్నపిల్లలంతా చదువు కంటే ఫోన్లతోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. ఆడుకున్నా ఫోన్ ఉండాల్సిందే.. చదువుకున్న ఫోన్ పక్కన ఉండాల్సిందే. బాత్ రూంకు వెళ్లినా ఫోన్ వెంట తీసుకెళ్తున్నారు. ఓ ఆరేళ్ల పిల్లాడు కూడా మొబైల్ ఫోన్ తో టాయిలెట్ రూంలోకి వెళ్లి అందులో చిక్కుకున్నాడు. ఈ ఘటన సెంట్రల్ చైనాలోని వుహాన్ నగరంలో జరిగింది. 

టాయిలెట్ రూంలోకి వెళ్లి మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ ఉండిపోయాడు. గంటల కొద్ది టాయిలెట్ సీటుపై కూర్చొవడంతో అందులో బుడ్డోడు ఇరుక్కుపోయాడు. నడుం వరకు టాయిలెట్ సీటులో ఇరికింది. అందులోనుంచి బయటకు రాలేక, పీక్కోలేక లబోదిబోమన్నాడు. గట్టిగా కేకలు వేశాడు. ఇంతలో కుమారుడు జారిపడ్డాడని తల్లిదండ్రులు టాయిలెట్ రూంలోకి పరిగెత్తుకొచ్చారు.
Also Read : Big Bకే కష్టాలా? : అమితాబ్ బచ్చన్ కారు అమ్మేశాడట

ఇంకేముంది.. బుడ్డోడు జారిపడలేదుగానీ, టాయిలెట్ సీటులో చిక్కుకున్నాడు. బయటకు తీసేందుకు ఎంతో ప్రయత్నించారు. ఫలితం లేకపోయింది. వెంటనే.. ఫైర్ ఫైటర్లకు వారు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఫైర్ పైటర్లు గంటకు పైగా శ్రమించి చివరికి టాయిలెట్ సీటును కట్ చేసి పిల్లాడిని బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో.. 
Also Read : చావుతో చెలగాటం.. అయినా వదల్లేదు : కారు బానెట్ పై 2కి.మీ వెళ్లాడు