China Concrete Camps : సరిహద్దుల్లో చైనా శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు!

ఏడాదికి పైగా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య సైనిక ప్రతిష్ఠంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

China Concrete Camps : సరిహద్దుల్లో చైనా శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు!

Concrete Structres

China Concrete Camps ఏడాదికి పైగా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య సైనిక ప్రతిష్ఠంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగి కొన్ని ముఖ్య ప్రాంతాల నుంచి ఇరు దేశాలు తమ దళాలను ఉపసంహరించుకున్నప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు అపరిషృతంగానే మిగిలి ఉన్నాయి. అయితే వాస్తవాధీన రేఖ వద్ద చైనా ఆర్మీ.. శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు చేపడతున్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు తాజాగా తెలిపాయి.

తూర్పు లడఖ్ సరిహద్దుల్లోనే కాకుండా ఉత్తర సిక్కింలోని నకు లా ప్రాంతానికి ఎదురుగా చైనా భూభాగంలోపల కొన్ని కిలోమీటర్ల దూరంలో శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలను డ్రాగన్ ఆర్మీ చేపడుతోందని ఓ సీనియర్ ప్రభుత్వ ఉన్నాధికారి తెలిపారు. గతేడాది మరిము ఈ ఏడాది జనవరిలో కూడా భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతానికి ఇది కొద్ది నిమిషాల దూరంలోనే ఉందని తెలిపారు.

అతి తక్కువ సమయంలో.. భారత్ తో వివాదస్పదంగా ఉన్న ప్రాంతాల్లోకి తమ దళాలు చేరుకునేందుకే చైనా ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ వర్గాల్లు తెలిపాయి. రహదారి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగానే ఉండటంతో చైనా దళాలు..భారత్ తో సరిహద్దు పంచుకునే ఏరియాలకి గతంలో కంటే ఇంకా మరింత తొందరగా చేరుకునేందుకే చైనా ఈ పనిచేస్తున్నట్లు సమాచారం. అరుణాల్ సెక్టార్ లో కూడా చైనా ఈ నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం. ఈ బిల్డింగ్ ల నిర్మాణం..చలి కాలంలో ఫార్వార్డ్ ఏరియాల్లో అసౌకర్యంగా ఫీల్ అవకుండా ఉండేందుకు కూడా చైనా సైనికులకు సాయపడుతుంది.

మరోవైపు,భారత్-చైనా దేశాల మధ్య కుదిరిన ప్రకారం..కొద్ది నెలల క్రితం పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి తమ దళాలను ఉపసంహరించుకున్న చైనా..ఆ దళాలను తమ ఆక్రమణలో ఉన్న టిబెట్ ఏరియాలోని రౌటోగ్ టౌన్ కి తరలించింది. అక్కడ కూడా చైనా బిల్డింగ్ ల నిర్మాణం చేపడుతున్నట్లు సమాచారం.