చైనా రీరూట్ ప్లాన్: పాక్ వెళ్లే అన్నీ విమాన సర్వీసులు రద్దు

చైనా పాకిస్థాన్ కు వెళ్లే అన్నీ విమాన సర్వీసులను రద్దు చేసింది. పాకిస్థాన్ వైమానిక మార్గంలో వెళ్లే విదేశీ విమానాలను రద్దు చేసినట్టు బీజింగ్ మీడియా తెలిపింది.

  • Published By: sreehari ,Published On : March 1, 2019 / 07:51 AM IST
చైనా రీరూట్ ప్లాన్: పాక్ వెళ్లే అన్నీ విమాన సర్వీసులు రద్దు

చైనా పాకిస్థాన్ కు వెళ్లే అన్నీ విమాన సర్వీసులను రద్దు చేసింది. పాకిస్థాన్ వైమానిక మార్గంలో వెళ్లే విదేశీ విమానాలను రద్దు చేసినట్టు బీజింగ్ మీడియా తెలిపింది.

పాకిస్థాన్ కు వెళ్లే అన్నీ విమాన సర్వీసులను చైనా రద్దు చేసింది. పాకిస్థాన్ వైమానిక మార్గంలో వెళ్లే విదేశీ విమానాలను రద్దు చేసినట్టు బీజింగ్ మీడియా ఒక ప్రకటనలో తెలిపింది. పుల్వామా ఉగ్రదాడి ఘటనతో భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పాకిస్థాన్ కూడా దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులను గురువారం మూసివేసింది. దీంతో యూరప్, దక్షిణ తూర్పు ఏసియా మేజర్ రూట్లలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ మార్గాల్లో వెళ్లే వేలాది మంది విమాన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చైనా తమ విమాన సర్వీసులను పాకిస్థాన్ మీదుగా, పాకిస్థాన్, భారత్ సరిహద్దుల నుంచి ఆపరేట్ చేస్తోంది. అయితే భారత్, పాక్ ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా విమాన సర్వీసుల రూట్ ను దారి మళ్లించింది. భారత్, మయన్మార్, సెంట్రల్ ఏసియా నుంచి చైనాలోకి ప్రవేశించేలా రీ రూట్ చేసినట్టు పౌర విమానాయన అధికారులు తెలిపారు. ప్రతి వారం పాకిస్థాన్, చైనాల మధ్య 22 విమానాలు సర్వీసులను చైనా ఆపరేట్ చేస్తోంది. 

అందులో రెండు చైనా ఎయిర్ లైన్స్ ఉండగా, పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ ఉన్నాయి. పాకిస్థాన్ గగనతలంలో విమాన సర్వీసులను నిలిపివేయడంతో చైనా, అంతర్జాతీయ విమాన సర్వీసులతో ఒప్పందం చేసుకొని తమ ఎయిర్ లైన్స్ రూట్లను రీ రూట్ చేసుకుంది. ఇప్పటికే సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా (కాక్) దేశీయ ఎయిర్ లైన్స్ కు ఎమర్జెన్సీ ప్లాన్ పై సూచనలు చేసింది. తాత్కాలిక విమాన సర్వీసులను నడిపే విషయంలో చైనా ఎయిర్ ఫోర్స్ కు సహకరించాల్సిందిగా సూచించింది.

ఇటీవల కాలంలో కాక్.. పాకిస్థాన్ కు వెళ్లే విమానాల సర్వీసుల్లో కొన్ని మార్పులు చేసింది. విమానాల్లో ప్రయాణించే ముందు ప్రయాణికులు ముందుగా ఫ్లయిట్ ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించింది. పాకిస్థాన్ తమ ఎయిర్ లైన్స్ సర్వీసులను మూసివేయడంతో 28 దేశీయ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో 49 అంతర్జాతీయ విమాన సర్వీసులను చైనా రీ రూట్ చేసినట్టు చైనా నేషనల్ రేడియో తెలిపింది.