చంద్రుడు వద్దా : చైనా కృత్రిమ సూర్యుడు

  • Published By: venkaiahnaidu ,Published On : March 6, 2019 / 05:11 AM IST
చంద్రుడు వద్దా : చైనా కృత్రిమ సూర్యుడు

ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూలన తయారైన వస్తువుకైనా ప్రత్యామ్నాయ వస్తువుని తయారు చేయడంలో చైనాని మించినవారు లేరు. అసలు – నకిలీకి తేడా లేకుండా తయారు చేస్తారు. అదేస్థాయిలో మార్కెట్లలో కూడా చైనా వస్తువులకు డిమాండ్ ఉంటుంది. చైనా ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే ఎందుకు ఉండాలని భావించిన చైనా.. డూప్లికేట్ తయారు చేయనుంది. కృత్రిమ సూర్యుడిని తయారుచేయడమేమిటి అనుకుంటున్నారా? అదేనండీ చైనా స్పెషాలిటీ.
Also Read : నేను బతికే ఉన్నా : ఎమ్మెల్యే ఓటు తొలగించాలంటూ అప్లికేషన్

కృత్రిమ సూర్యుడిని తయారుచేసే పనిలో ఇప్పుడు చైనా బిజీగా ఉంది. ఈ ఏడాది చివరినాటికి 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ అయాన్ ఉష్ణోగ్రతతో.. కృత్రిమ సూర్యుడి నిర్మాణాన్ని చైనా పూర్తి చేయనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. సాధారణ సూర్యుడు, నక్షత్రాలు నియంత్రిత అణు విచ్చిత్తి ద్వారా అనంతమైన శక్తిని అందిస్తున్నట్లుగానే.. అణు విచ్చిత్తి ప్రక్రియ ప్రతిబింబించేందుకు HL-2M టోకామాక్ పరికరాన్ని చైనా తయారు చేస్తుంది. దీన్నే కృత్రిమ సూర్యుడిగా పిలుస్తున్నారు. ఆకాశంలో సూర్యుడు కదలికలు ఉండే మాదిరిగానే.. చైనా సూర్యుడు రెడీ అవుతున్నాడు.

ఇక మిగిలింది చంద్రుడే. సూర్యుడు తర్వాత కృత్రిమ చంద్రుడినీ తయారు చేస్తే సరిపోతుంది అంటున్నారు నెటిజన్లు. కృత్రిమ సూర్యుడిగా మాదిరిగానే రాత్రి పూట చంద్రుడు కూడా చల్లని గాలులు ఇస్తుంటే ఎంత బాగుంటుందో కదా అంటున్నారు.
Also Read : ఫోర్బ్స్: ప్రపంచ కుబేరుడు అమెజాన్ అధిపతి జెఫ్‌ బెజోస్‌