India-China: స‌రిహ‌ద్దుల వ‌ద్ద చైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది: అమెరికా

భార‌త్‌లోని తూర్పు ల‌ద్దాఖ్ వ‌ద్ద చైనా వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరుపై అమెరికా మ‌రోసారి ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల వ‌ద్ద ప‌రిస్థితుల‌ను మ‌రింత క్లిష్ట‌త‌రం చేసేలా డ్రాగ‌న్ దేశం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అమెరికా ర‌క్షణ శాఖ కార్య‌ద‌ర్శి లాయిడ్ జేమ్స్ ఆస్టిన్ అన్నారు.

India-China: స‌రిహ‌ద్దుల వ‌ద్ద చైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది: అమెరికా

India-China: భార‌త్‌లోని తూర్పు ల‌ద్దాఖ్ వ‌ద్ద చైనా వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరుపై అమెరికా మ‌రోసారి ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల వ‌ద్ద ప‌రిస్థితుల‌ను మ‌రింత క్లిష్ట‌త‌రం చేసేలా డ్రాగ‌న్ దేశం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అమెరికా ర‌క్షణ శాఖ కార్య‌ద‌ర్శి లాయిడ్ జేమ్స్ ఆస్టిన్ అన్నారు. సింగ‌పూర్‌లో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… త‌మ భూభాగాలు అని చైనా చెప్పుకుంటోన్న ప్రాంతాల విష‌యంలో ఆ దేశం దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోన్న వేళ అమెరికా త‌న మిత్ర దేశాల హ‌క్కులను కాపాడేందుకు మ‌ద్ద‌తుగా నిలుస్తుంద‌ని చెప్పారు.

prophet row: రాంచీలో హింస‌.. ఇద్ద‌రి మృతి.. ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

ద‌క్షిణ చైనా స‌ముద్రంలో అక్ర‌మ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని తెలిపారు. కాగా, తూర్పు ల‌ద్దాఖ్‌ పాంగాంగ్ స‌ర‌స్సు ప్రాంతం వ‌ద్ద రెండేళ్ల క్రితం చైనా-భార‌త్ సైనికుల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో అక్క‌డి కొన‌సాగిన ప్ర‌తిష్టంభ‌నతో యుద్ధ వాతావర‌ణం నెల‌కొంది. అనంత‌రం ఇరు దేశాల ప‌లు దశ‌లుగా చ‌ర్చ‌లు జ‌రపడంతో ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాయి. అయితే, చైనా మ‌ళ్లీ తూర్పు ల‌ద్దాఖ్‌కు స‌మీపంలో మౌలిక వ‌స‌తుల‌ను అభివృద్ధి చేసుకుంటూ క‌ల‌క‌లం రేపుతోంది.

prophet row: ముస్లిం దేశాల‌న్నీ భార‌తీయ‌ ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించాలంటూ బంగ్లాదేశ్‌లో నిర‌స‌న‌లు

అలాగే, ఇండో-ప‌సిఫిక్ ప్రాంతంలో వియ‌త్నాం, జ‌పాన్ వంటి దేశాల‌తో చైనాకు స‌ముద్ర‌త‌ల స‌రిహ‌ద్దుల విష‌యంలో వివాదాలు ఉన్నాయి. ఆయా మిత్రదేశాల‌తో ర‌క్ష‌ణ రంగ అంశాల్లో పూర్తి నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేస్తున్నామ‌ని ఆస్టిన్ తెలిపారు. కాగా, తూర్పు ల‌ద్దాఖ్‌ వ‌ద్ద చైనా మౌలిక వ‌స‌తులు అభివృద్ధి చేసుకుంటూ ఆందోళ‌నక‌ర చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ఇటీవ‌లే అమెరికా ఆర్మీ ప‌సిఫిక్ క‌మాండింగ్ జ‌న‌ర‌ల్ చార్లెస్ ఎ.ఫ్లిన్ వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. భార‌త్‌లో ఆయ‌న ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. అయితే, భార‌త్‌-చైనా మ‌ధ్య ఉన్న విభేదాల విష‌యంలో త‌ల‌దూర్చ‌వ‌ద్దంటూ చైనా కూడా స్పందించింది.