డెలివరీ బాయ్ తో మాజీ ప్రియుడి మొహాన వేడివేడి టీ కొట్టించిన ప్రియురాలు..!

డెలివరీ బాయ్ తో మాజీ ప్రియుడి మొహాన వేడివేడి టీ కొట్టించిన ప్రియురాలు..!

Girlfriend beating hot tea on ex Boyfriend face: హోం డెలివరీ జనాలకు బాగా అలవాటైపోయింది. ఏది కావాలన్నా ఇంట్లోంచి కాలు కదపకుండా తెప్పించేసుకోవచ్చు. ఆ హోం డెలివరీ చేయటానికి వచ్చిన డెలివరీ బాయ్ ని ఓ యువతి బాగా ఉపయోగించుకోవాలనుకుంది. డెలివరీ వ్యవస్థను పగ తీర్చుకోవడానికి వాడేసుకోవాలనుకుంది.

చైనాలోని ఓ యువతి తన మాజీ ప్రియుడిపై గుర్రుగా ఉంది. బాగా కోపం వచ్చింది. ప్రియుడిపై పగ తీర్చుకోవాలనుకుంది. ఏం చేయాలా? అని ఆలోచించింది. తాను చేసిన పనికి అతను ఢంగైపోయావాలి. అతని పరువు పోవాలి. ఇదేంటీ ఇంత దారుణంగా చేసింది అని షాక్ అవ్వాలి..దాని కోసం ఏం చేయాలా? అని ఆలోచించింది. దాని కోసం ఓ ఐడియా వేసింది.

ఓ టీ షాపులో వేడి వేడి టీ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని తన బాయ్‌ఫ్రెండ్ వద్దకు తీసుకెళ్లి మొహాన కొట్టాలని డెలివరీ బాయ్‌కి చెప్పింది. అలా చేస్తే డబ్బులిస్తానని చెప్పింది. ఈ వింత ఆర్డర్ తీసుకున్న సదరు డెలివరీ బాయ్.. టీ తీసుకెళ్లి రోడ్డుపై నిలబడి ఉన్న ఆమె బాయ్‌ఫ్రెండ్ వద్దకు వెళ్లాడు. ఆమె ఆర్డర్ చేసిన హోటల్ రిసీట్ అతని చేతిలో పెట్టాడు.

అదేంటాని..అతని దాన్ని పరిశీలిస్తుండగానే..తన చేతిలో పొగలు కక్కుతున్న కప్పులోని టీ ని ఆ యువకుడి మొహాన కొట్టాడు. ఆ తర్వాత రిసీట్‌లో కస్టమర్ రిక్వెస్ట్ చూపించాడు. ఈ మొత్తాన్ని కొందరు కెమెరాలో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది.