చంద్రుడిపై కొత్త లోహాన్ని కనుగొన్న చైనా ..

టెక్నాలజీలోనే కాదు పరిశోధనల్లో కూడా దూసుకుపోతున్న చైనా చంద్రడిపై ఓ సరికొత్త లోహాన్ని కనుగొంది.

చంద్రుడిపై కొత్త లోహాన్ని కనుగొన్న చైనా ..

China discovers new mineral on Moon

China discovers new mineral on Moon : టెక్నాలజీలోనే కాదు పరిశోధనల్లో కూడా దూసుకుపోతున్న చైనా చంద్రడిపై ఓ సరికొత్త లోహాన్ని కనుగొంది. అమెరికాతో పోటీ పడతున్న చైనా పరిశోధనల్లో కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ఈ రెండు దేశాల మధ్యా కొనసాగుతున్న ఆధిపత్య పోరు కాస్తా కేవలం భూ గ్రహంమీదే కాకుండా అంతరిక్షంలో కూడా కొనసాగుతోంది. ఆధిపత్య పోరు ప్రస్తుతం భూ గ్రహం అవతలికి కూడా విస్తరించింది. పరిశోధనల పేరిట ఏకంగా చంద్ర మండలాన్ని సొంతం చేసుకోవాలని అమెరికా, చైనా తహతహలాడుతున్నాయి. తామే ముందు సొంతం చేసుకోవాలని..చంద్రుడిపై నివాసాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఆర్టిమిస్‌-1 పేరిట ఇప్పటికే ప్రాజెక్టును ప్రకటించింది అమెరికా.

దీనికి పోటీగా చైనా రంగంలోకి దిగింది. ఈక్రమంలో చంద్రునిపై చైనా ఓ కొత్త లోహాన్ని కనుగొంది. చాంగ్‌-5 మిషన్‌లో భాగంగా రాయి .. ధూళితో కూడిన మిశ్రమ నమూనాలను 2020లోనే భూమిపైకి తీసుకొచ్చింది. 1,40,000 నమూనాలను క్షుణ్ణంగా వేరు చేసి అందులో ఒక స్ఫటికాకార లోహాన్ని కనుంగొంది. దీనికి చాంగేసైట్‌-వైగా పేరు పెట్టింది. ఈ విషయాన్ని చైనా అటామిక్‌ ఎనర్జీ అథారిటీ వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం మూడు దేశాలు చంద్రునిపై కొత్త లోహాలను కనుగొనగా..వాటిలో అమెరికా, రష్యా ఉండగా..తాజాగా వీటి సరసన చేసింది డ్రాగన్ దేశం.

చంద్రుడిపై కొత్త ఖనిజం గుర్తించిన చైనా మాంచి ఊపుమీదుంది. ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ వచ్చే 10 ఏళ్లలో చంద్రుడి కక్ష్యలోకి మరో మూడు మిషన్లను ప్రయోగించాలని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ యోచిస్తోంది. 2020లో చైనా చేపట్టిన ఛాంగే-5 మిషన్ చంద్రుడిపై నీటి ఆనవాళ్లతో పాటు కొత్త ఖనిజాన్ని గుర్తించారు చైనా శాస్త్రవేత్తలు. చాంగేసైట్ (Y) గా పిలిచే స్తంభాల క్రిస్టల్‌లో కొత్త ఫాస్ఫేట్ ఖనిజం ఉన్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. భవిష్యత్తు ఇంధనానికి వనరుగా భావించే హీలియం-3 మూలకం పుష్కలంగా ఉందని తెలిపారు.

చంద్రునిపై కొత్త ఖనిజాలను కనుగొనడం కొత్తకాకపోయినా..ఇది అసాధారణం. అమెరికా, సోవియట్ రష్యా సంయుక్తంగా ఐదు కొత్త ఖనిజాలను చంద్రుడిపై గుర్తించాయి. కానీ, ఇటీవల కాలంలో చైనా మాత్రమే తాజాగా ఖనిజాన్ని గుర్తించింది. చంద్రుడి నుంచి సేకరించి రాయి..మట్టి నమూనాలను బీజింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యురేనియం జియాలజీలో వేరుచేసి విశ్లేషించారు. ఇప్పటి వరకూ భూమిపై ఇటువంటి మూలకం గుర్తించలేదని చైనా శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు.

భూమిపై మొక్కల పెరుగుదలకు కీలకమైన ఫాస్ఫేట్ వంటి లక్షణాలు చాంగేసైట్ స్తంభాల క్రిస్టల్ నిర్మాణాలలో ఉన్నాయి. ఖనిజాలు వృద్ధి చెందే చంద్రునిపై ఫాస్ఫేట్ కనుగొనడంలో ఆశ్చర్యం లేదు..కానీ స్తంభాల క్రిస్టల్ రూపం మాత్రం కొత్తదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఫాస్ఫేట్ ఈ రూపం ఆవిష్కరణ భవిష్యత్తులో చంద్రునిపై వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తు ఇంధన వనరుగా భావిస్తోన్న హీలియం-3 కూడా ఈ ఖనిజంలో ఉండటం ఆసక్తి కలిగిస్తోంది.

చైనా తదుపరి మిషన్ Chang’e-7.. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర నీటి వనరుల పరిశోధనపై దృష్టి సారించనుంది. చేంజ్‌సైట్-(Y) ప్రయోజనాలను కనుగొనే ప్రయత్నంతో పాటు చంద్రుడిపై మరిన్ని ఖనిజాల కోసం అన్వేషణ జరగవచ్చు.

 

China discovers, new mineral,Moon,