భారత సైన్యాన్ని రెచ్చగొడుతున్న చైనా..సరిహద్దుల్లో యుద్దాలు

  • Published By: madhu ,Published On : May 21, 2020 / 09:06 AM IST
భారత సైన్యాన్ని రెచ్చగొడుతున్న చైనా..సరిహద్దుల్లో యుద్దాలు

భారత్‌ ఎంత సహనంగా వ్యవహరిస్తున్న గాని రెండు వారాలుగా చైనా భారత సైన్యాన్ని రెచ్చగొడుతూనే ఉంది.  ఓ వైపు నేపాల్‌ని ఎగదోస్తూ.. మరోవైపు బోర్డర్స్ దగ్గర భారత సైన్యంతో ఘర్షణకు దిగుతోంది. రెండు వారాల నుంచి ఇలాగే చేస్తున్న చైనాకి మనపై ఎందుకింత కడుపు మంట?

తాజాగా పాంగాంగ్ సరస్సు దగ్గర భారీగా గస్తీ పెంచింది. లద్దాఖ్ ఈశాన్య ప్రాంతం దగ్గర మామూలుగా తిరిగే పెట్రోలింగ్‌ని మూడింతలు చేసిందని నిఘా వర్గాల సమాచారం. దీంతో భారత కూడా నావికదళం గస్తీని పెంచి.. 45 కిలోమీటర్ల మేర ఉన్న సరస్సు పరిధిలో చైనా సైన్యాన్ని నిలువరించే ప్రయత్నం చేసింది. 

లద్దాక్ ఏరియాలో చైనా ‘లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్’ వెంబడి ఎప్పుడేం జరుగుతుందో అని టెన్షన్ నెలకొంది. పెట్రోలింగ్ చేసే బోట్ల సంఖ్య మూడు నుంచి 9కి పెంచడమే కాకుండా గస్తీ కాస్తున్న పద్దతిలోనూ చైనా చురుగ్గా వ్యవహరిస్తోందని ఆర్మీ చెప్తోంది. గత నెలరోజులుగా చైనా వ్యవహరించే విధానంలో మార్పు స్పష్టంగా కన్పిస్తుందని, యుద్ధానికే సిధ్దమైనట్టుగా దాని చేష్టలు కన్పిస్తున్నాయని భారత్ ఆర్మీ అంచనా వేస్తున్నాయ్.  

లద్దాక్ సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సు పరిధిలోని పర్వతప్రాంతాల్లోని ఉత్తరభాగాలను ఫింగర్ పాయింట్లుగా వ్యవహరిస్తుంటాయ్.. భారత్ ఈ ఫింగర్ పాయింట్లలో 8వ నంబర్ వద్ద నుంచి వాస్తవాధీన రేఖ వెళ్తుందని చెప్తుండగా.. చైనా మాత్రం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఫింగర్ పాయింట్ టు వద్ద పాస్ అవుతుందని వాదిస్తుంది. అందుకే తాము అక్కడ గస్తీ నిర్వహిస్తున్నట్లు వెల్లడిస్తోంది. 

ఇదే సమయంలో చైనా సైనికులు తమ వాహనాలలో  వచ్చి మరీ పెద్ద ఎత్తున లద్దాక్ సరిహద్దుల భారీగా పహరా నిర్వహించడానికి వీలుంది. 1999లో భారత్ పాకిస్తాన్‌తో కార్గిల్ వార్‌లో బిజీగా ఉన్న సమయంలో ..చైనా గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడ రోడ్డు మార్గం నిర్మించుకుంది. ఈ రోడ్డు మార్గంతో వారికి భారీగా వాహనాలతో సహా గస్తీకి వీలు కలిగింది. ఇందుకే ఈ మధ్యనే భారత్ కూడా గాల్వాన్ ఏరియాలో రోడ్డు నిర్మించింది.. దీనిపైనే చైనా భారత సైన్యాన్ని చైనా సైనికులు నిలువరించారంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తోంది.  

అయితే కరోనా వైరస్ విషయంలో చైనాని ప్రపంచదేశాలు  దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుండటంతో తట్టుకోలేకపోతోంది. దానికి తోడు అక్కడి కంపెనీల్లో భారత్‌కి తమ కార్యాలయాలు తరలిస్తున్నాయనే ప్రచారంతో మింగలేక కక్కలేక నానా అవస్థలూ పడుతోంది. దానికి ముందే చైనా భారత్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి కేంద్రం తప్పనిసరి చేసింది.

ఇందుకోసం FDI పాలసీల్లోనే మార్పులు చేసింది. ఇక తాజాగా వైరస్ పై చైనాలో ఎంక్వైరీ జరగాల్సిందేనంటూ భారత్‌ అనడంతో చైనాకు మండిపోతోంది. ఆ కసి ఏదోలా తీర్చుకోవడానికే భారత సరిహద్దుల దగ్గర ఇలా ప్రదర్శిస్తోందని స్పష్టమవుతోంది. 

Read: సముద్రంలోకి దూకి తిమింగళాన్ని కాపాడిన వ్యక్తికి భారీగా జరిమానా