స్పోర్ట్స్ మార్కెట్‌ను శాసిస్తున్న చైనా.. ఇండియాపై డ్రాగన్ డామినేషన్..!

  • Published By: srihari ,Published On : June 25, 2020 / 02:32 PM IST
స్పోర్ట్స్ మార్కెట్‌ను శాసిస్తున్న చైనా.. ఇండియాపై డ్రాగన్ డామినేషన్..!

మేడ్‌ ఇన్‌ చైనా.. ఆ పేరు చూస్తే చాలు.. ఎగబడి కొనేస్తారు. లక్షల ధర పలికే ఖరీదైన టీవీల నుంచి రూపాయి ఖరీదుండే గుండు సూది వరకు.. చైనా ప్రోడక్ట్స్‌కి వుండే గిరాకీ అంతా ఇంతా కాదు.. డ్రాగన్‌ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువుల పట్ల భారతీయులకు ఎందుకింత ప్రేమ పెరిగిందంటే? మార్కెట్‌లో లభ్యమయ్యే చాలా వస్తువులతో పోల్చితే.. చైనా ప్రోడక్ట్స్‌ ధరలు తక్కువకే వస్తాయి. చీప్ అండ్ బెస్ట్.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చైనాతో యుద్ధవాతావరణం నేపథ్యంలో భారతీయుల నుంచి బాయ్‌కాట్ చైనా స్లోగన్ విన్పిస్తోంది. చైనా వస్తువులు మన క్రీడారంగంలో ఎంతగా పాతుకుపోయాయో కూడా తెలిస్తే.. ఈ స్లోగన్ అంత తొందరగా సక్సెస్ అవుతుందా అనే సందేహం రాక మానదు. అంతగా చైనా ప్రభావం దేశంపై ఎంతగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. 

అన్ని చైనా నుంచే : 
క్రికెట్ ఆడాలంటే…బ్యాట్ అక్కడి నుంచే రావాలి.. షటిల్ ఆడాలంటే… కాక్ కూడా ఆ దేశం నుంచే రావాలి. బాస్కెట్ బాల్… డౌట్ లేదు ఇది కూడా ఆ దేశం నుంచే వస్తోంది. చివరకు ఫుట్‌బాల్ కూడా.. మరి ఇవన్నీ వస్తోంది చైనా నుంచే.. వీటిని ఇప్పటికిప్పుడు బ్యాన్ చేయడం కుదురుతుందా..? అది సాధ్యమేనా? కచ్చితంగా అవును అని చెప్పలేని పరిస్థితి. క్వాలిటీ సంగతి దేవుడెరుగు.. ఐటమ్ చాలా గొప్పగా కనిపిస్తుంది.. అదే చైనా ప్రోడక్ట్‌ ప్రత్యేకత అంటుంటారు. ఒక్కోసారి క్వాలిటీ విషయంలోనూ చైనానే బెస్ట్‌ అనిపించేలా ఉంటుంది. 10 రూపాయలు పెట్టి కొన్న ఓ ఆట బొమ్మ.. పాతికేళ్ళ లైఫ్‌ చూసేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అందుకే, చాలామందికి ‘మేడిన్‌ చైనా’ అంటే అంత పిచ్చి. ఇప్పుడు మాత్రం సిచ్యుయేషన్ మారిపోయిందంటున్నారు. ‘బ్యాన్‌ చైనా ప్రోడక్ట్స్‌’ అనే డిమాండ్‌ ఇప్పుడు తెరపైకి వచ్చింది.. మేం చైనా ప్రోడక్ట్స్‌ని బ్యాన్‌ చేస్తున్నాం.. అని పలువురు సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా పబ్లిసిటీ స్టంట్లు షురూ చేశారు. సాధ్యమయ్యే పనేనా ఇది.? అని ఒక్కసారి ఆలోచిస్తే.. ‘అసాధ్యమైతే కాదుగానీ.. మనోళ్ళకు అంత చిత్తశుద్ధి లేదనే చెప్పాలంటున్నారు.
China dominates Sports Market, Dragon Domination all over India 

ధర తక్కువ.. క్రేజ్ ఎక్కువ :
మేడ్ ఇన్ చైనా అంటే ధర తక్కువనే క్రేజ్..  చిత్తశుద్ధి లేకుండా స్లోగన్లు కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బైజుస్‌లో చైనా ఇన్వెస్ట్‌మెంట్ పివి సింధును రూ.48 కోట్లతో అండార్స్ చేసుకున్న లినింగ్ కూడా చైనా కంపెనీ. 2018 ఆసియన్ గేమ్స్, టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియన్ అథ్లెట్ల అప్పారెల్స్ లినింగ్‌వే కంపెనీగా చెబుతున్నారు. రూ.35కోట్లతో కిడాంబి శ్రీకాంత్‌తో డీల్… ఐపిఎల్‌కి వివో అఫిషియల్ స్పాన్సర్ చెబుతోంది. క్రికెట్ ఓ రెలిజియన్‌లా భావించే ఇండియాలో టీమిండియా స్పాన్సరర్ బైజుస్‌లో చైనా ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయ్.. టెన్సెంట్ అనే కాంగ్లోమెరేట్ కంపెనీకి బైజుస్‌లో చెప్పుకోదగ్గ వాటానే ఉంది. 

బైజుస్‌ను టీమిండియా Bycott చేయగలదా? : 
ఇప్పటికిప్పుడు బైజుస్‌ని టీమిండియా బాయ్‌కాట్ చేయగలదా.. BCCI ఆ దిశగా ఏదైనా ఆలోచిస్తుందాని చూడాలి.. బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధుని అండార్స్ చేసుకున్న లి నింగ్ కూడా చైనా కంపెనీనే.. నాలుగేళ్ల కోసం రూ.48కోట్లతో ఆమెని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది ఈ కంపెనీ.. ఓ బ్యాడ్మింటన్ ప్లేయర్‌కి ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇదే ఫస్ట్ టైమ్.. సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ గెలిచిన తర్వాత లి నింగ్ అమ్మకాలు ఎక్కడికో వెళ్లిపోయాయ్.. ఇదే ఊపులో లినింగ్ ఏకంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తోనే కోట్లాది రూపాయల డీల్స్ సెట్ చేసుకుంది. 2018 ఆసియన్ గేమ్స్, టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే ఇండియన్ అథ్లెట్ల జెర్సీలపై తన బొమ్మ ఉండేలా ప్లాన్ చేసుకుంది.. ఇందుకోసం కొన్ని కోట్లు కుమ్మరించింది. 
​​​​china bycott

కిడాంబి శ్రీకాంత్‌కి నాలుగేళ్ల కోసం 35కోట్లతో కాంట్రాక్ట్ కుదర్చుకోవడం కూడా ఒకటి.. గాల్వాన్ ఘర్షణలో 20మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పుడు చైనా ఉత్పత్తుల నిషేధం ఎఫెక్ట్ లి నింగ్‌పైనా పడబోతోంది. లి నింగ్‌తో ఒప్పందం రివ్యూ చేస్తామంటూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రకటించింది. బిసిసిఐ కూడా ఐపిఎల్ స్పాన్సర్ షిప్ ని రివ్యూ చేస్తామని చెప్పింది. వివో ఫోన్ ఐపిఎల్‌కి అఫిషియల్ స్పాన్సర్.. ఐతే వివో.. ఒప్పోలు చైనీస్ బ్రాండ్లు అనే సంగతి తెలిసిందే.

చైనా తర్వాత లినింగ్ పెద్ద మార్కెట్ ఇండియానే :
లినింగ్‌కి చైనా తర్వాత ఇండియానే పెద్ద మార్కెట్.. ఐతే భారత్‌లో లినింగ్ ఒక్కటే కాదు.. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ లెక్కల ప్రకారం.. 91,872.59 లక్షల కమోడిటీ ఉత్పత్తులు భారత్ 2019 ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి 2020 వరకూ దిగుమతి చేసుకుంది. ఇవన్నీ కూడా ఇన్‌డోర్, ఔట్‌డోర్ గేమ్స్, జిమ్, స్పోర్ట్స్, అథ్లెటిక్ వస్తువులే కావడం..క్రీడారంగంలో చైనా ముద్ర ఎంతగా పాతుకుపోయిందో తెలుస్తోంది.. ఈ కాలంలో మొత్తం దిగుమతులు.. రూ.1,39,912 కోట్లు వాటిలో చైనా వాటానే 65శాతంగా ఉండగా, రెండో ప్రధానవాటా రూ. 11,588 కోట్లతో జపాన్ దక్కించుకుంది.

అన్నింటిలోనూ చైనా డామినేషనే :
అందులోనూ గత ఐదేళ్లలో చైనా నుంచి దిగుమతయ్యే క్రీడారంగ వస్తువుల వాటా 80శాతం పెరగడం గమనించాలి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో  రూ. 59,434 కోట్లు. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి.. రూ. 107,514 కోట్లు చేరుకుంది. అందుకే ఇప్పటికిప్పుడు చైనా ఉత్పత్తులపై బ్యాన్ విధించినా కూడా వాడకం వెంటనే ఆగిపోయేది.  మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలి.
China dominates Sports Market, Dragon Domination all over India 

అవసరాలకు తగిన స్థాయిలో ఉత్పత్తి, తయారీ చేయాలంటే దానికి వనరులు కూడా అదే స్థాయిలో ఉండాలి. బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్‌లో చైనా తన డామినేషన్ కొనసాగిస్తోంది. బాస్కెట్ బాల్స్, ఫుట్ బాల్స్ కూడా చైనా నుంచే తయారయి వస్తున్నాయంటే మన దేశంలో చైనా ఉత్పత్తులు చాప కింద నీరులా ఎలా విస్తరించాయో అర్ధం చేసుకోవచ్చు.

జిమ్నాజియంలలో వాడే.. ఉత్పత్తులు అత్యంత చవకగా తయారు చేసే కంపెనీ తైషాన్.. ఇది చైనా కంపెనీనే. ఐతే చవకగా ధర ఉన్నా క్వాలిటీ విషయంలో ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ అప్రూవల్స్ ఉన్న ఉత్పత్తులే విక్రయిస్తుంది. మొత్తం జిమ్‌కి అవసరమైన ఎక్విప్‌మెంట్ అంతా కోటి రూపాయలలోపే సరఫరా చేస్తుంది ఈ కంపెనీ. అదే జర్మనీ. ఫ్రెంచ్ కంపెనీలవైతే రెండు కోట్ల రూపాయల వరకూ ఖర్చు అవుతుందట. మరిలాంటి స్థితిలో ఇప్పటికిప్పుడు చైనా ఉత్పత్తులనుంచి వైదొలగాలంటే అది సాధ్యపడదంటారు.