China Imports Donkey: గాడిదల్ని, కుక్కల్ని కొంటామంటున్న చైనా.. ఎందుకో తెలుసా?

కుక్కలు, గాడిదల్ని పాకిస్తాన్ నుంచి కొనేందుకు చైనా ఆసక్తి చూపిస్తోంది. దీనికి కారణం ఉంది. ఈ జంతువుల చర్మం నుంచి తయారయ్యే ఒక పదార్థం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌కు ఉపయోగపడుతుంది.

China Imports Donkey: గాడిదల్ని, కుక్కల్ని కొంటామంటున్న చైనా.. ఎందుకో తెలుసా?

China Imports Donkey: పాకిస్తాన్ నుంచి గాడిదల్ని, కుక్కల్ని కొనేందుకు చైనా ఆసక్తి చూపిస్తోంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్‌ను చైనా ఈ రకంగా ఆదుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అప్పులపాలైన పాకిస్తాన్‌కు వాటిని తీర్చే శక్తి లేదు.

Bapatla: బాపట్లలో విషాదం.. సముద్రంలో విద్యార్థులు గల్లంతు

అలాగని కొత్త అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. ఆహారం, చమురు కొనడానికి కూడా ఆ దేశం దగ్గర డబ్బులు లేవు. పైగా ఇటీవలి వరదలు ఆ దేశాన్ని కోలుకోని విధంగా నాశనం చేశాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఆర్థిక వనరులు లేవు. ఈ సమయంలో పాకిస్తాన్‌కు చైనా అండగా నిలుస్తోంది. పాకిస్తాన్ నుంచి కుక్కలు, గాడిదల్ని తీసుకుని, ఆ దేశానికి నిధులు అందివ్వాలని భావిస్తోంది. దీనికి కారణం ఉంది. గాడిదలు, కుక్కల చర్మం నుంచి ఎజియావో అనే పదార్థాన్ని తయారు చేస్తారు. ఈ పదార్థాన్ని ఔషధాల తయారీలో వాడుతారు. ఇది చాలా ఖరీదైంది. పాకిస్తాన్ నుంచి కుక్కలు, గాడిదల్ని దిగుమతి చేసుకుంటే దీన్ని ఎక్కువ మొత్తంలో తయారు చేయొచ్చు. అందుకే ఈ అంశంపై చైనా దృష్టి సారించింది.

Type-C Cable: చార్జింగ్ కేబుల్ కష్టాలకు చెల్లు.. ఇకపై అన్ని గాడ్జెట్లకు ఒకటే కేబుల్.. చట్టం చేసిన యురోపియన్ యూనియన్

అయితే, ఈ నిర్ణయం కొత్తదేం కాదు. గతంలో పాకిస్తాన్ నుంచి కుక్కలు, గాడిదలు, ఒంటెల మాంసం చైనాకు దిగుమతి అయ్యేది. చాలా ఏళ్ల నుంచే పాక్ తమ దేశం నుంచి జంతువుల్ని చైనాకు ఎగుమతి చేస్తోంది. మరోవైపు పాక్ నుంచి కొనేబదులు అఫ్ఘనిస్తాన్ నుంచి కొనుక్కుంటే మేలని కొందరు చైనా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే అఫ్ఘనిస్తాన్ ఇంకా తక్కువ ధరకే వీటిని అందివ్వాలని భావిస్తోంది. అయితే, ప్రస్తుతం లంపీ వైరస్ నేపథ్యంలో అక్కడి నుంచి జంతువులు, మాంసం దిగుమతుల్ని నిషేధించారు.