China : ఎవరెస్ట్ శిఖరంపై చైనా లైన్

China : ఎవరెస్ట్ శిఖరంపై చైనా లైన్

Covid 19

Mount Everest : సరిహద్దుల విషయంలో నిత్యం గొడవలు పెట్టుకోవడం డ్రాగన్ కంట్రీకి అలవాటు. సరిహద్దు వివాదాలు పరిష్కరించుకొనేందుకు..ఆ దేశానికి పెద్దగా ఆసక్తి కనబడడం లేనిదిగా కనిపిస్తోంది. ఇప్పటికీ భారత్ తో ఉన్న సరిహద్దు విషయంలో…వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు భారత్ భూభాగంలోకి..చొచ్చుకొని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఇలాంటి చైనా..ప్రపంచానికి కరోనాను అంటించేసిందన్న తర్వాత..ఆ దేశపు సరిహద్దులో ఆంక్షలు విధిస్తోంది. ఎవరెస్ట్ శిఖరంపై ప్రత్యేక సరిహద్దు..గీసేందుకు డ్రాగన్ కంట్రీ సిద్ధమైంది. కోవిడ్ తో సతమతమౌతున్న నేపాల్ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే వారి నుంచి వైరస్ వ్యాపిస్తుందనే ఉద్దేశ్యంతో..ఈ చర్యలకు ఉపక్రమించింది. ఎవరెస్ట్ శిఖరంపై బేస్ క్యాంపులో కొంతమంది అనారోగ్యం పాలవడంతో…అక్కడ కొత్త లైన్ ఏర్పాటు చేయనుంది.

వైరస్ కు పుట్టినిల్లయిన.. ఈ దేశంలో కేసులు అంతగా లేవు. సరిహద్దులు మూసివేయడం, లాక్ డౌన్ విధించడంతో కరోనా కంట్రోల్ కు వచ్చింది. ఈ సమయంలో ఎవరెస్ట్ బేస్ క్యాంపులో 30 మంది అనారోగ్యం పాలు కావడం, వీరు నేపాల్ నుంచి వచ్చారని చైనా గుర్తించింది. ప్రస్తుతం నేపాల్ లో సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.

దీంతో సరిహద్దుల వద్ద చర్యలు తీసుకొంటోంది. ఎవరెస్ట్ శిఖరంపై ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య పర్వతారోహకుల మధ్య..కలయికను నిరోధించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు..చైనా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది ఎవ‌రెస్ట్ ఎక్క‌డానికి 21 మందికి చైనా అనుమ‌తి ఇచ్చింది. ఏప్రిల్ లో టిబెట్‌లో క్వారంటైన్‌లో ఉన్న అనంతరం శిఖరాన్ని అధిరోహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విదేశీ పర్వతారోహకును నిషేధించింది.

Read More : Telangana : లాక్ డౌన్ దిశగా తెలంగాణ ?