డాడీ ఐడియా : అమ్మ కోసం ఏడ్చే పిల్లాడికి పాలు ఎలా తాగించాడో చూడండీ..

డాడీ ఐడియా : అమ్మ కోసం ఏడ్చే పిల్లాడికి పాలు ఎలా తాగించాడో చూడండీ..

China father mother photo in tablet feeding son : బుజ్జాయిలకు ఎప్పుడూ అమ్మ తమ కళ్లముందే ఉండాలి. లేదంటే గుక్కపట్టి ఏడ్చేస్తారు. పాలు తాగకుండా ఏడుస్తూనే ఉంటారు. కానీ అమ్మ దగ్గరలేని బుజ్జాలకు పాలు తాగించటం..ఆహారం తినిపించటం అంటే మాటలు కాదు. అమ్మలైతే ఏదో విధంగా పిల్లలు సముదాయిస్తారు..బుజ్జగించి పాలు తాగిస్తారు. అన్నం తినిపిస్తారు. కానీ పిల్లలను కంట్రోల్ చేయడం తండ్రులకు పెద్దగా సాధ్యం కాదు. బుజ్జాయిలు మారాం చేస్తారు. అటువంటి ఓ బుడ్డోడికి పాలు తాగించటానికి ఓ తండ్రి భేల ఐడియా వేశాడు.

చైనాలోని జియాంగ్సి ప్రావిన్స్​కు చెందిన ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశాడు. భార్య పనిమీద బైటకెళ్లింది. పిల్లాడికి ఆకలేస్తోంది. కానీ పాలు తాగడం లేదు. గుక్కపెట్టి ఒకటే ఏడ్చేస్తున్నాడు. పిల్లాడితో పాలు తాగించటానికి శతవిధాలా యత్నిస్తున్నాడు. కానీ ఆ పెంకిపిల్లాడు ఏమాత్రం వినటంలేదు. దీంతో తండ్రికి ఓ ఐడియా వచ్చింది.

ఇంట్లో ఉండే ట్యాబ్లెట్ తలకు కట్టుకున్నాడు. దాంట్లో భార్య ఫొటోను ఓపెన్ చేసి పిల్లాడికి చూపించాడు. అమ్మ కనిపించగానే ఆ గడుగ్గాయి ముఖం కమలంలా వికసించింది. అమ్మే తనకు పాలు తాగిస్తోందనుకుని తండ్రి తాగించే పాలను చక్కగా అల్లరి చేయకుండా తాగేశాడు. ట్యాబెట్లను చూస్తూ.. అమ్మేననుకుంటూ..చిట్టి బొజ్జను నిండా పాలు తాగాడు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్​గా మారింది. చైనీస్ సోషల్ మీడియ వెబియోలో వీడియో దుమ్మురేపేస్తోంది. నెటిజన్లు లైక్​లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తండ్రి పిల్లాడికి పాలు తాగించే ఐడియా సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు.

https://youtu.be/9lTN6UPudoQ