Guinnes Records Restaurant : ఆకాశాన్ని తాకే రెస్టారెంట్…గిన్నిస్ బుక్ లో స్థానం

చైనాలోని షాంఘైలో ఓ రెస్టారెంటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉన్న ఈ రెస్టారెంట్ రికార్డు సాధించింది.

Guinnes Records Restaurant : ఆకాశాన్ని తాకే రెస్టారెంట్…గిన్నిస్ బుక్ లో స్థానం

Heavenly Jin Restaurant Made It To Enter Guinnes Book Of World Records

Heavenly Jin Restaurant Guinnes Records  : చైనా అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ‘కోవిడ్’. కానీ చైనాలో ఎన్నో అద్భుతమైన నగరాలున్నాయి. అత్యద్భుతమైన కట్టడాలున్నాయి. ప్రపంచ వింతల్ని తలదన్నేంత అబ్బురంగా..అమేజింగ్ గా ఉంటాయా కట్టడాలు.అటువంటి ఓ కట్టడం గిన్నిస్ రికార్డు సాధించింది.అదే చైనాలోని షాంఘై నగరంలోని ఓ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉండటంతో గిన్నిస్ రికార్డు సాధించింది.

This Is Officially the World's Highest Restaurant in a Building | Travel +  Leisure

చైనా ప్రధాన నగరాల్లో ఒకటైన షాంఘైలో ఓ రెస్టారెంటు ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. తలెత్తి చూడాలనుకున్నా ఆ రెస్టారెంట్ కనిపించదు. అంత ఎత్తులో ఉంది. ఎందుకంటే ఆ రెస్టారెంటు భూమి నుంచి అరకిలోమీటరు ఎత్తులో ఉంటుంది. 555.36 మీటర్ల ఎత్తులో ఉండే ఆ రెస్టారెంటును చైనాలోని అత్యం ప్రఖ్యాతి పొందిన షాంఘై టవర్స్ లో 120వ అంతస్తులో ఉంది. దాని పేరు హెవెన్లీ జిన్ రెస్టారెంట్.

Highest Restaurant in a Building: Heavenly Jin restaurant sets world record

చైనా ప్రభుత్వ అధీనంలోని హోటల్ గ్రూప్ కు చెందిన ఈ చెందిన ఈ హెవెన్లీ జిన్ రెస్టారెంట్. పేరుకు తగినట్లుగా స్వర్గంలో ఉన్నట్లుగా ఉంటుంది.అక్కడ కూర్చుని ఆహారం తినటం ఓ అత్యద్భుతమైన అనుభూతి అని వేరే చెప్పనక్కరలేదు. ఈ రెస్టారెంటులో కూర్చుంటే మేఘాల్లో మీటింగ్ పెట్టినట్లే ఉంటుంది. గాల్లో తేలినట్లుందే గుండె జారి నట్లుందే అనిపిస్తుంది.

Highest Restaurant in a Building: Heavenly Jin restaurant sets world record

ఈ రెస్టారెంట్ ఓపెన్ కిచెన్ ఉంటుంది. హోటల్ కు వచ్చే అతిథులు ఎవరైనా కిచెన్ లోకి ప్రవేశించి అక్కడ వంటకాలు తయారుచేయటం చూడవచ్చు. ఈ హెవెన్లీ రెస్టారెంట్ ఒకేసారి 256 మంది కూర్చుని విందు ఆరగించవచ్చు. ఇంకా దీంట్లో ఐదు ప్రైవేటు డైనింగ్ రూములు కూడా ఉన్నాయి.

Guinness Names Heavenly Jin the World's Highest Restaurant in a Building -  Thrillist

హెవెన్లీ జిన్ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ రేసులో ఈ హెవెన్లీ రెస్టారెంట్ దుబాయ్ కి చెందిన అట్మోస్ఫియర్ రెస్టారెంటును కూడా వెనక్కి నెట్టేసి మరీ రికార్డును సొంతం చేసుకుంది. అట్మోస్ఫియర్ రెస్టారెంటు 441.3 మీటర్ల ఎత్తులో కొలువై ఉంటుంది. జే హోటల్ గ్రూప్..షాంఘై టవర్స్ లో 120వ అంతస్థులు ఏర్పాటు చేశారు. షాంఘై టవర్స్ 632 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్స్ లో మూడో స్థానంలో ఉంది.