చైనా.. జపాన్‌‌లలో కరోనా సెకండ్ ఇన్నింగ్స్

చైనా.. జపాన్‌‌లలో కరోనా సెకండ్ ఇన్నింగ్స్

కరోనా వైరస్ కట్టడి చేయడంలో హాంకాంగ్, జపాన్లు ఫెయిల్ అయ్యాయి. చైనా నుంచి భారీ సంఖ్యలో కరోనా మహమ్మారి బయట దేశాలకు పాకిన తర్వాతనే చైనా ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకుంది. ఆ తర్వాతే లాక్ డౌన్ ప్రకటించి కరోనా చైన్ ను బ్రేక్ చేసింది. ఎక్కడికక్కడ క్లస్టర్లను గుర్తించి ట్రీట్‌మెంట్ ఇచ్చింది. ఇక తగ్గిపోయిందనుకుంటున్న తరుణంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది కరోనా.

చైనా, జపాన్‌లలో రెండో సారి విజృంభిస్తున్న కరోనా.. అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. టోక్యో గవర్నర్ యూరికో కొయక్ నగరవాసులను ఈ వారంతం వరకూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దంటూ సూచించారు. ఈ ఇన్ఫెక్షన్ ను ఎట్టి పరిస్థితుల్లో అయినా అడ్డుకోవాలని.. ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. జపాన్ లో ఇప్పటికీ వెయ్యి 314కేసులు నమోదైనట్లు సమాచారం. 

హాంకాంగ్‌లోనే అదే పరిస్థితి. కర్ఫ్యూతో లాక్ డౌన్ ను తీసుకొచ్చి ఎక్కడివారిని అక్కడే నిర్భందించారు. గురువారం ఒక్కరోజే 43 కొత్తకేసులు నమోదవగా ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

చైనాలో డిసెంబర్లో మొదలైన కరోనా.. తగ్గినట్లే కనిపించి మళ్లీ రివర్స్ అయింది. విదేశాల నుంచి వస్తున్న వారి ద్వారా మరో సారి విశ్వరూపం చూపించేందుకు సిద్ధమైంది. బుధవారం నాటిక 67కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 90శాతం విదేశాల నుంచి వచ్చిందేనని అధికారులు అంటున్నారు. 

యూకేలో ఉన్న రీసెర్చర్స్ చైనా వూహాన్ లోని స్కూళ్లు, వర్క్ ప్లేస్‌లు తప్పనిసరిగా ఏప్రిల్ వరకూ మూసివేయాలని సూచిస్తున్నారు. మార్చి తర్వాత రీ ఓపెన్ చేస్తామంటోన్న స్కూళ్లు ఇంకా మూసేయాలంటున్నారు. మార్చి 31తో నిషేదాలన్నీ ఎత్తివేస్తే మరో సారి మహమ్మారికి ఆహ్వానం పలికినట్లేనని సమాచారం. పూర్తిగా లాక్ డౌన్ నిర్వహించకపోయినా అక్టోబరు వరకూ మాత్రం జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.