ఈ చైనా యాప్ తో మీ దగ్గరలో ఎవరికి కరోనా సోకిందో గుర్తించొచ్చు!

  • Published By: sreehari ,Published On : February 12, 2020 / 07:11 AM IST
ఈ చైనా యాప్ తో మీ దగ్గరలో ఎవరికి కరోనా సోకిందో గుర్తించొచ్చు!

ప్రాణాంతక కరోనా వైరస్ (COVID-19) బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది కొత్త వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు చైనా సహా ప్రపంచ దేశాలు నివారణ చర్యలు చేపట్టాయి. అయినా ఈ కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలు తీసేదాక వదిలేట్టు కనిపించడం లేదు. ఒక చైనాకు మాత్రమే పరిమితం కాదు ఈ వైరస్.. ఇప్పుడు ఎక్కడ ఉందో.. ఎవరికి సోకిందా కూడ తెలియడం చాలా కష్టం. మీ పక్కనే ఉన్నవారికి కూడా ఈ వైరస్ సోకి ఉండొచ్చు. లక్షణాలు కనిపించినా కచ్చితంగా అది కరోనా వైరస్ అని గుర్తించలేని పరిస్థితి.

గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. వ్యాధిగ్రస్థులను తాకినా వారు ముట్టుకున్న వస్తువులను మీరు తాకినా కూడా వైరస్ వెంటనే వ్యాపిస్తోంది. ఏ వస్తువు ఉపరితలంపైనా వైరస్ జీవిత కాలం 9 గంటలు మాత్రమే. అలోగా ఈ వైరస్ క్షణాల్లో వేలాది మందికి కూడా వ్యాపించొచ్చు. ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా 42వేల మందికిపైగా వైరస్ సోకినట్టు అధికారులు చెబుతున్నారు. వైరస్ బారిన పడి 1000కి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే కష్టమే మరి. అందుకే కరోనా వైరస్ స్ర్పెడ్ చేసిన చైనానే అది ఎక్కడ ఉందో గుర్తించే అప్లికేషన్ కనిపెట్టింది. అదే.. ‘Close contact detector’ అనే యాప్ డిజైన్ చేసింది. రాష్ట్ర మండలిలోని ప్రధాన కార్యాలయంతో పాటు నేషనల్ హెల్త్ కమిషన్, చైనా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ గ్రూపు కార్పొరేషన్స్, ఇతర కొన్ని చైనీస్ ప్రభుత్వ శాఖల సపోర్టుతో సంయుక్తంగా ఈ ‘Close contact detector’ యాప్ రూపొందించారు.  

ఈ యాప్ స్మార్ట్ ఫోన్ యూజర్లందరూ ఈజీగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఎవరికైనా ఈ కరోనా వైరస్ లక్షణాలు లేదా అప్పుడే సోకి ఉన్నా వెంటనే గుర్తించవచ్చు. మీరు ఉండే దగ్గరలో ఎవరికైనా ఈ వైరస్ ఉందని తెలిస్తే.. ముందు జాగ్రత్తగా వారి నుంచి దూరంగా ఉండొచ్చునని చైనా స్టేట్ రన్ న్యూస్ ఏజెన్సీ జిన్హువా ఒక రిపోర్టులో పేర్కొంది. కరోనా వైరస్ బాధితులు దగ్గరలో ఎక్కడ ఉన్నారో ఈ యాప్ వెంటనే చెప్పేస్తోంది. స్మార్ట్ ఫోన్లలో యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న యూజర్లు QR కోడ్ ద్వారా scan చేసి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. Alipay, WeChat లేదా QQ యాప్స్ ద్వారా ఈజీగా వైరస్ బాధితులను గుర్తించవచ్చు. 

ముందుగా మీరు చేయాల్సిందిల్లా.. ఈ Appsలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. యూజర్లు తమ పేరు, ID నెంబర్ ఎంటర్ చేయాలి. రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఫోన్ యూజర్ ఇతర ముగ్గురు ID నెంబర్లతో వైరస్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. వాస్తవానికి వైరస్‌కు మీ దగ్గరలో ఉందని యాప్ ఎలా గుర్తిస్తుందో పూర్తి అందుబాటులో లేవు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని గుర్తించాలంటే వారికి మీరు అతి దగ్గరగా ఉన్న సమయంలో యాప్ ద్వారా సంకేతాలు అందుతాయి. ఒకే ఇంట్లో ఉండొచ్చు.. క్లాసురూంలో లేదా ఒకేచోట కలిసి పనిచేస్తున్నా కూడా యాప్ ద్వారా వైరస్ ఉన్నట్టుగా గుర్తించవచ్చు. వైద్య సిబ్బందికి ఈ వైరస్ ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. ఎందుకంటే వైరస్ బాధితులకు దగ్గరగా ఉండటం కారణంగా వారికి కూడా కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువ. 

కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం దూరంగా ఉండాలనడం ఆమోద యోగ్యంగానే ఉంది కానీ, వైరస్ సోకిన బాధితులను దూరంగా పెడితే అది వారిలో ఆత్మనూన్యత భావాన్ని పెంచినవాళ్లం అవుతాం. ఎవరికైనా తమకు వైరస్ సోకిందని తెలిసి పక్కనుండే వారు దూరంగా పెడితే ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. ఇది మానసికంగా వారిని మరింత కృంగేలా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు విశ్లేషుకులు అభిప్రాయపడుతున్నారు.