Son Kidnaped: కిడ్నాప్ అయిన కొడుకు కోసం 5 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసిన తండ్రి..

కిడ్నాప్ అయిన కొడుకు కోసం ఓ తండ్రి 5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాడు. 24 సంత్సరాల పాటు కొడుకు కోసం వెదికి వెదికి ఎట్టకేలకు కలుసుకున్నాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తన కొడుకులా కిడ్నాప్ కు గురైన పిల్లలను కనిపెట్టి తల్లిదండ్రుల ఒడికి చేర్చాడు. ఆ తండ్రి కొడుకు కోసం పడిన తపనకు విధి సైతం తలవంచి తండ్రీ కొడుకులను కలిపిందిన అత్యంత అద్భుతమైన ఘటన ఎంతోమందిని కదిలించివేసింది.

Son Kidnaped: కిడ్నాప్ అయిన కొడుకు కోసం 5 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసిన తండ్రి..

Boy New Reporter (1)

Son And Father Kidnap : కన్నబిడ్డలు కిడ్నాప్ కు గురైతే ఆ తల్లిదండ్రులు పడే మానసిక వేదనను మాటల్లో చెప్పలేం. అలా తప్పిపోయిన కొడుకు కోసం ఓ తండ్రి తల్లడిల్లిపోయాడు. ఏ తండ్రీ చేయని సాహసం చేశాడు. కొడుకు కోసం వెదుకుతునే ఉన్నాడు. ప్రతీ అంగుళం కళ్లు కాయలు కాచేలా..జల్లెడ పట్టాడు. అలా 10 కాదు 20 కాదు..100 కాదు వేలు కాదు ఏకంగా 5 లక్షల కిలోమీటర్లు కిడ్నాప్ కు గురైన కొడుకు కోసం ప్రయాణించాడు. ఆ వెతుకులాటలో తన కొడుకులా కిడ్నాప్ అయిన పిల్లలను రక్షించి వారి తల్లిదండ్రుల ఒడికి చేర్చాడు. కొడుకు కోసం అలా 10 కాదు 15 కాదు ఏకంగా 24 సంవత్సరాల పాటు గాలించి గాలించి శోధించి శోధించి కొడుకు జాడ కనుక్కున్నాడు. ఇక ఆ తండ్రి ఆనందం గురించి చెప్పటానికి మాటలు చాలవు..24 సంత్సరాల పాటు వెదికిన కొడుకు కళ్లముందు కనిపిస్తే ఎన్ని కోట్ల రూపాయలు కళ్లముందు పెడితే వస్తుంది ఆ ఆనందం..అన్ని సంవత్సరాల కష్టం ఉష్ కాకిలా ఎగిరిపోయింది. కొడుకు గుండెలకు హత్తుకుని పసిపిల్లాడిలా భోరుమని ఏడ్చాశాడు. కొడును కోసం గాలించే సమయంలో రోడ్లమీదా.ఫుట్ పాత్ లపైనా ఇలా ఎక్కడ పడితే అక్కడే పడుకునేవాడు. చేతిలో డబ్బులు లేకపోతే భిక్షమెత్తుకుని తిని బతికాడు.అయినా కొడుక కోసం గాలించటం మానలేదు. 24 ఏళ్ల అతని అసాధారణ ప్రయత్నానికి విధి సైతం తలవంచింది. వెదికి వెదికి చివరకు కనిపెట్టాడు కన్నకొడుకుని..2 ఏళ్ల వయస్సులో కిడ్నాప్ అయిన కొడుకు 24 ఏళ్ల వయస్సులో కనిపించటంతో ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోయాడు పిచ్చి తండ్రి.

చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన గువొ గ్యాంగ్‌టాంగ్‌ 2 ఏళ్ల కొడుకు ఇంటి ముందు ఆడుకుంటుంటే కొందరు కిడ్నాప్ చేశాడు. ఇద్దరు వ్యక్తులు తమ బిడ్డను ఎత్తుకెళ్లిపోయారని గువో గుర్తించాడు. కిడ్నాప్ చేసిన పిల్లాడిని కిడ్నాపర్స్ హైనాన్ కు తీసుకెళ్లి.. అమ్మేశారు. కొడుకు కోసం గువో తల్లడిల్లిపోయాడు. కొడుకు కోసం వెదకని చోటు లేదు. మొక్కని దేవుడు లేడు. గువో కొడుకు కోసం 20 ప్రావిన్సులను వేయి కళ్లతో జల్లెడ పట్టాడు. అయినా దొరకలేదు. ఈ ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలకు గురయ్యాడు. దోపిడీలకు గురయ్యాడు.

ఈ 24 ఏళ్ల వెతుకులాటలో అతను.. ఎదుర్కొన్న పరిస్థితులు, అతని జీవన గమనం అత్యంత దయనీయం. దారుణం. తప్పిపోయిన తన కొడుకు ఫోటోను బ్యానర్స్ చేయించి కనిపించినవారికల్లా ఇచ్చేవాడు. గోడలపై అంటించేవాడు. ఫోటో చూపించి ఈ పిల్లాడిని ఎవరైనా ఎక్కడైనా చూశారా? అని పదే పదే అడిగేవాడు. అలా ప్రయాణంలో రాత్రి వంతెనల కింద, ఫుట్‌పాత్‌పై నిద్రపోయేవాడు. దొరికింది తినేవాడు. లేకుంటే భిక్షమెత్తేవాడు. అలా కొడుకు కోసం వెదికే క్రమంలో తనలా పిల్లలను కోల్పోయిన వారికి గువో ఓ దార్శనికుడిలా కనిపించాడు. మా పిల్లలు కూడా తప్పిపోయారు.మీ ప్రయాణంలో కనిపిస్తే మాకు చెప్పండి అంటూ ఎంతోమంది గువోను వేడుకున్నాడు.అలా తన ప్రయాణంలో గువో ఏడుగురు చిన్నారుల్ని కనిపెట్టాడు. వారిని అత్యంత చాకచక్యంగా తప్పించి తల్లిదండ్రుల ఒడికి చేర్చాడు. ఆ పుణ్యమేనేమో గువోను కొడుకు కనిపించేలా చేసి ఉంటుంది.

కొడుకు కోసం గువో వేదన.. సోషల్ మీడియాను కదిలించింది. గువో ప్రయత్నానికి సోషల్ మీడియా యూజర్లు సహకారం అందించారు. చివరగా ఆ తండ్రి యత్నం..అందరి ప్రయత్నాలు ఫలించాయి. అలా గువో కుమారుడు హైనాన్‌లో ఉంటున్నట్లుగా తెలిసింది. ఈ విషయాన్ని గువోకు..అతని భార్యకు తెలిపారు. ఈ వార్త విన్న గువో ఆనందం అంతా ఇంతా కాదు..కళ్లముందు కొడుకు కనిపించినట్లే ఫీల్ అయిపోయాడు. కళ్లల్లో కన్నీళ్లు ధారగా కారుతునే ఉన్నాయి. రెక్కలు కట్టుకుని వాలిపోయాడు కొడుకు ఉన్న హైనాన్ లో. 2 ఏళ్ల వయస్సులో తప్పిపోయిన కొడుకును 24 తరువాత చూడటంతో.. ఉబ్బితబ్బిబైపోయారు ఆ తల్లిదండ్రులు.వారి ఆనందం అంతా పోగేస్తే ఈ లోకం మొత్తం సరిపోదేమో. పట్టరాని ఆనందం..మిన్నంటిన సంతోషం. వారి కంటినుంచికారిన ఆనందబాష్పాలు వారి సంతోషానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించాయి. గువో తన కొడుకును హత్తుకుని కన్నీరు పెట్టారు. అయితే, గువో గ్యాంగ్‌టాంగ్ కొడుకుని డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించడం వారి బడ్డేనని రూఢీ అయ్యింది.

గువో, అతని కొడుకు కలిసి క్షణంలో మీడియా అక్కడే ఉంది. కెమెరాలు క్లిక్ క్లిక్ మంటూనే ఉన్నాయి. తమ జీవితంలో ఇంత గొప్ప అనుభూతికి సంబంధించిన ఫోటోలు తీయటం ఎప్పుడూ లేనట్లుగా ఫ్లాష్ లు వెలుగులు చిమ్మాయి. గువోకి, అతని కొడుక్కి అభినందనలు తెలిపారు. కాగా, గువో, అతని కొడుకు కలిసిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పలువురు నెటిజన్లు. ఆ కొడుకు కోసం తండ్రి సుదీర్ఘయాత్ర..హాట్‌టాపిక్‌గా మారింది. గువో 24 సంవత్సరాల గాలింపుకు దేవుడు కూడా బహుశా బిడ్డను తండ్రీని దూరం చేశానని బాధపడి ఉంటాడు. అందుకే ఇద్దరిని కలిపి ఉంటాడు. ఈ తండ్రి అసాధారణ ప్రయత్నానికి హ్యాట్సాఫ్ చెబుతూనే.. వారికి అభినందనలు తెలిపారు. ఓ అంచనా ప్రకారం చైనాలో 2015లో 20వేలమంది పిల్లలు కిడ్నాప్ చేయబడ్డారు. వీరిలో ఎక్కువ శాతం మంది పిల్లలను అమ్మటానికే కిడ్నాప్ చేస్తుంటారు. అలా గువో కొడుకుని 1997లో కిడ్నాప్ చేయబడ్డాడు. గువోకు ఇప్పుడు 90 సంవత్సరాలు.