China’s New Border Law : కొత్త భూ సరిహద్దు చట్టానికి చైనా ఆమోదం..భారత్ పై ప్రభావం

 భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు మొదలై ఏడాది దాటిపోయింది. ఇప్పటికీ సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఓవైపు ఇరుదేశాల సైనికాధికారుల

China’s New Border Law : కొత్త భూ సరిహద్దు చట్టానికి చైనా ఆమోదం..భారత్ పై ప్రభావం

China

China’s New Border Law భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు మొదలై ఏడాది దాటిపోయింది. ఇప్పటికీ సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఓవైపు ఇరుదేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నా మరోవైపు మోహరింపులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పేరుతో కొత్త జాతీయ సరిహద్దు చట్టాన్పి చైనా తీసుకొచ్చింది.

చైనా సైన్యానికి అపరిమితాధికారాలు కల్పించేలా రూపొందించిన ఈ చట్టానికి… నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్థాయీ సంఘం సభ్యులు శనివారం లెజిస్లేటివ్ సెషన్ ముగింపు సమావేశంలో ఆమోదం తెలిపారు. భారత్ తో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దూకుడు చర్యలు మొదలైన వెంటనే ఈ చట్టం ప్రతిపాదనలు కూడా ప్రారంభమయ్యాయి. ఏడాదిగా ఈ చట్టానికి పదునుపెడుతున్న చైనా సర్కార్.. ఇప్పుడు అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ కొత్త చట్టం వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని చైనా సర్కార్ ప్రకటించింది. ఈ చట్టం..తమ భూభాగాన్ని రక్షించడానికి, చైనా భూభాగాలపై విదేశాల అభ్యంతరాలను చర్యలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం, మిలిటరీకి అవకాశం కల్పించేలా రూపొందించింది

చైనా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత అత్యంత పవిత్రమైనవి, అనుల్లంఘనీయమైనవి అని ఈ చట్టం చెబుతోంది. ప్రాదేశిక సమగ్రత,సార్వభౌమాధికారం, భూ సరిహద్దులకు విఘాతం కలిగించే ఎటువంటి పనులనైనా అడ్డుకునేందుకు చైనా ఎలాంటి చర్యలైనా చేపడుతుందని చట్టంలో పేర్కొంది. సమానత్వం, పరస్పర విశ్వాసం, స్నేహపూర్వక సంప్రదింపులు అనే సూత్రాల ద్వారా సరిహద్దు వ్యవహారాలను నిర్వహించనున్నట్లు చట్టంలో పేర్కొన్నారు. చర్చలతోనే పొరుగు దేశాలతో వివాదాలను పరిష్కరించుకుంటామని వివరించారు.

సరిహద్దుల్లో ప్రజలు నివసించేలా, పని చేసుకునేలా ప్రోత్సహించనున్నట్లు ఈ కొత్త సరిహద్దు చట్టం వెల్లడించింది. సరిహద్దుల్లో రక్షణను పటిష్టపరచాలని, సాంఘిక, ఆర్థికాభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సరిహద్దు ప్రాంతాలను తెరవడం, ప్రభుత్వ సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల జీవితం, జీవనోపాధి కోసం కూడా చర్యలు తీసుకోవాలని తెలిపింది.

చైనా తీసుకొచ్చిన తాజా చట్టం భారత్​తో సరిహద్దు వివాదంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.భారతదేశ సరిహద్దు వెంబడి ఫార్వర్డ్ ప్రాంతాల్లో చైనా సైనిక దళాలను మోహరించడం, వాస్తవాధీన రేఖలో అతిక్రమణలు, కొత్త సరిహద్దు నిర్మాణం వంటివి ఈ సరిహద్దు చట్టంలో ఉన్నాయి. ఇప్పటి వరకు 12 పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలను చైనా పరిష్కరించుకున్నప్పటికీ భారత్, భూటాన్ ​తో మాత్రం చైనాకు సరైన సరిహద్దు లేదు. భారత్, భూటాన్‌లతో చైనాకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. భారత్ ​తో 3,488 కిలోమీటర్లు, భూటాన్​తో 400 కి.మీ మేర సరిహద్దు వివాదాస్పదంగా ఉంది. కొత్త చట్టంలో.. భారతదేశం, భూటాన్‌తో వివాదాస్పద భూభాగాలలో చైనా చర్యలను అధికారికం చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.

ALSO READ T20 World Cup : Live Blog- ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అప్‌డేట్స్