Xi Jinping : ఆధిపత్యం కాదు.. శాశ్వత శాంతి లక్ష్యం

తమది ఆధిపత్య విధానం కాదని.. ఆగ్నేయాసియాలో శాశ్వత శాంతి కొరకు తాము కృషి చేస్తున్నామని చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ తెలిపారు. ఆగ్నేయాసియా దేశాల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

10TV Telugu News

Xi Jinping :  దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఆగ్నేయాసియాలోని చిన్న దేశాలకు సవాల్ విసురుతూ దక్షిణ చైనా సముద్రంను తమ సైన్యంతో నింపేసింది. కృత్రిమ దీవులను నిర్మిస్తున్న సముద్ర సంపదపై కన్నేసింది. అయితే ఇదే అంశంపై చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ఆగ్నేయ ఆసియాపై ఆధిపత్యాన్ని తాము కోరుకోవడం లేదని చెప్పారు. పొరుగు దేశాలను చైనా ఎప్పుడు బెదిరించదని వివరించాడు. నవంబర్ 22న ఆగ్నేయాసియా దేశాలతో జరిగిన వర్చువల్ కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు జిన్‌పింగ్

చదవండి : China-Constructed Enclave : అదిగో.. అరుణాచల్‌లో చైనా రెండో గ్రామం.. శాటిలైట్ ఫొటోలే సాక్ష్యం..!

“చైనా ఆధిపత్యవాదం, అధికార రాజకీయాలను బలంగా వ్యతిరేకిస్తుంది, తన పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని, ఉమ్మడిగా ఈ ప్రాంతంలో శాశ్వత శాంతిని పెంపొందించాలని కోరుకుంటుందని వివరించాడు. చైనా ఆధిపత్యాన్ని కోరుకోదని..చిన్న దేశాలను తమ దేశం ఎప్పుడు హింసించమని చెప్పుకొచ్చాడు. అయితే చైనా విస్తరణవాదం దాని సరిహద్దు దేశాలను కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. దేశ సరిహద్దులను సవరిస్తూ.. తైవాన్ లాంటి చిన్న దేశాలను బెదిరిస్తూ.. దక్షిణ చైనా సముద్రంలో కార్యకలాపాలు నడుపుతుంది.

చదవండి : Viruses from China: చైనా నుంచి మరో 18 వైరస్‌లు కనుగొన్న సైంటిస్టులు

చైనా మెత్తని మాటలు చెబుతున్నప్పటికి అవి నమ్మశక్యంగా లేవని ఆగ్నేయాసియా దేశాల అభిప్రాయం. దక్షిణ చైనా సముద్రంలోని పగడపు దిబ్బలపై చైనా సైన్యం తిష్టవేసింది. ఇక్కడ ఇసుక, కాంక్రీట్ తో కృత్రిమ ద్విపాలు నిర్మించి కీలకమైన షిప్పింగ్ మార్గాలు, చేపల నిల్వలు మరియు సముద్రగర్భ చమురు మరియు గ్యాస్ నిక్షేపాలకు నిలయమైన జలమార్గంలో చైనా తన ఉనికిని బలోపేతం చేయడానికి ప్రయత్నించింది.

చైనా నౌకాదళం, తీర రక్షక దళం, సముద్రపు మిలీషియా తమ ప్రత్యేక ఆర్థిక మండలాల్లోని వనరులను దోపిడీ చేసేందుకు ప్రాంతీయ దేశాల కదలికలను నిరోధించేందుకు ప్రయత్నించాయి. ఆ ప్రాంతంలో USతోపాటు ఇతర విదేశీ మిలిటరీల కార్యకలాపాలను తీవ్రంగా వ్యతిరేకించింది. దక్షిణ చైనా సముద్రంలో వ్యవహారాలను నిర్వహించడానికి చైనా, ASEAN దేశాల మధ్య కొన్నేళ్లుగా ప్రవర్తనా నియమావళిపై చర్చలు జరుపుతున్నాయి. అయితే ఆ చర్చల్లో ఎటువంటి పురోగతి సాధించలేదు. ఓ వైపు చర్చలు జరుగుతుంటే మరోవైపు చైనా చెయ్యాల్సిన పని చేస్తూనే ఉంది.

చదవండి : China Overtakes U.S : ప్రపంచంలో నెం.1 సంపన్న దేశంగా చైనా..తాజా రిపోర్ట్ లో కీలక విషయాలు

ఆగ్నేయాసియా దేశాలకు చైనా కీలకమైన మార్కెట్‌గా అలాగే పెట్టుబడి వనరుగా ఉంది.. ఈ నేపథ్యంలోనే ఆ దేశంతో విభేదాలను నివారించడానికి ASEAN ప్రయత్నించింది. ASEAN దేశాలకు కంబోడియా, మయన్మార్‌‌, లావోస్‌లతో పాటు చైనాతో కూడా బలమైన సంబంధాలు ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా మయన్మార్‌‌లో సైనిక ప్రభుత్వం పరిపాలిస్తుండటంతో ASEAN దేశాలకు ఆ దేశంతో సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వర్చువల్ సమావేశంలో మయన్మార్ చర్చ జరపలేదు ASEAN దేశాలు.

చదవండి : China Snowfall : చైనాలో 116 ఏళ్లలో అత్యధిక హిమపాతం ఇదే!

అయితే సోమవారం జరిగిన ఆగ్నేయాసియా దేశాల సమావేశానికి మయన్మార్ సైనిక ప్రభుత్వం నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించలేదు. దీంతో ఆ దేశం గురించి ఈ సమావేశంలో ఎటువంటి చర్చ జరగలేదు. కాగా గత 8 నెలల కాలంలో మయన్మార్ లో హింస పెరిగిపోయింది. 1200 మంది పౌరులను అక్కడి సైనిక ప్రభుత్వం హత్యచేసింది.

×