ఘోర రోడ్డు ప్రమాదం : ట్రక్కుని ఢీకొన్న బస్సు.. 36మంది మృతి

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 36మంది చనిపోయారు. మరో 36మందికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో

  • Published By: veegamteam ,Published On : September 29, 2019 / 03:00 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం : ట్రక్కుని ఢీకొన్న బస్సు.. 36మంది మృతి

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 36మంది చనిపోయారు. మరో 36మందికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 36మంది చనిపోయారు. మరో 36మందికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 69మంది ప్రయాణికులు ఉన్నారు. శనివారం(సెప్టెంబర్ 28,2019) ఉదయం ఈస్ట్రన్ చైనా జియాంగ్ సు ప్రావిన్స్ లోని చాంగ్ చున్-షెన్ జెన్ ఎక్స్ ప్రెస్ వే పై ఈ ఘటన జరిగింది.

గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. 26మంది స్వల్పంగా గాయపడ్డారు. అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే చాంగ్ చున్-షెన్ జెన్ ఎక్స్ ప్రెస్ వే ని మూసివేశారు. రాకపోకలు నిలిపివేశారు. సహాయ చర్యలు పూర్తయ్యాక 8 గంటల తర్వాత ఎక్స్ ప్రెస్ వే ని తిరిగి ఓపెన్ చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదాలు చాలా కామన్ అని అధికారులు అంటున్నారు. 2015 సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 58వేల మంది చనిపోయారని నివేదికలు చెబుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే 90శాతం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అని వెల్లడించారు.