China Sky Eye Telescope : చైనా ఏలియన్స్ జాడ గుర్తించిందా?! Sky eye టెలిస్కోప్ ఇచ్చిన సమాచారం ఏంటీ?
ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ స్కై ఐని చైనా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఆ స్కై ఐ ఇప్పుడు ఓ కొత్త సమాచారాన్ని ఇచ్చింది. ఈ భూగోళం అవతల కూడా ప్రాణులు ఉన్నట్లు టెలిస్కోప్ స్కై ఐ గుర్తించింది. దీంతో చైనా ఏలియన్స్ జాడ గుర్తించిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

China Sky Eye telescope : భూమి మీద కాకుండా ఇతర గ్రహాలపై జీవజాలం ఉందా? గ్రహాంతరవాసులు (ఏలియన్స్) ఉన్నారా? అనే ప్రశ్నలు ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలకు ఎన్నో ఏళ్లుగా ఉన్న ప్రశ్న. ఏలియిన్స్ ఉన్నాయని కచ్చితంగా చెప్పలేని స్థితి. ఈ అంశంపై శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. ఆకాశంలో ఎగిరే పళ్లాలను చూశామని..అవి ఏలియన్స్ కు సంబంధించినవేననే అనుమానాలకు బలమైన ఆధారాలేమి లభించలేదు. కానీ భూమ్మీద కాకుండా ఇతర గ్రహాలపై కూడా జీవం ఉందని ఏలియన్స్ ఉన్నాయనే నమ్మకమే పరిశోధనలు కొనసాగటానికి కారణంగా ఉంది. ఈక్రమంలో చైనా చేస్తున్న పరిశోధనల్లో ఏలియిన్స్ ని గుర్తించిందా? చైనా ఇటీవల ఆవిష్కరించిన టెలిస్కోప్ స్కై ఐ ఎటువంటి సమాచారాన్ని సేకరించింది? అనే అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ స్కై ఐని చైనా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఆ స్కై ఐ ఇప్పుడు ఓ కొత్త సమాచారాన్ని ఇచ్చింది. ఈ భూగోళం అవతల కూడా ప్రాణులు ఉన్నట్లు టెలిస్కోప్ స్కై ఐ గుర్తించింది. చైనాకు చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ డెయిలీ ఈ విషయాన్ని తెలిపింది. మొదట ఈ రిపోర్ట్‌ను ప్రచురించినా.. ఆ తర్వాత ఆ నివేదికల్ని తొలగించింది. కానీ గ్రహాంతర జీవాలు ఉన్నట్లు స్కై ఐ పసికట్టినట్లు చైనా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. స్కై ఐ టెలిస్కోప్‌కు చెందిన ఎలక్ట్రోమ్యాగ్నటిక్ సిగ్నల్స్‌ను పరిశోధకులు ఇంకా స్టడీ చేస్తున్నారని బీజింగ్ వర్సిటీలోని శాస్త్రవేత్త జాంగ్ టోంజీ తెలిపారు.
స్కై ఐ అందించిన సిగ్నల్స్‌పై కొన్ని అనుమానాలు ఉన్నాయని..ఓ తరహా రేడియో తరంగాల ప్రమేయం జరిగిందని, దీనిపై మరింత విశ్లేషణ అవసరమని జాంగ్ తెలిపారు. ప్రస్తుతం గ్రహాంతరవాసుల సమాచారం చైనాలో సోషల్ నెట్వర్క్ వీబోలో ట్రెండ్ అవుతోంది. ఆ సమాచారాన్నే దేశంలోని ఇతర మీడియా కూడా వైరల్ చేస్తోంది.
2020 సెప్టెంబర్‌లో స్కై ఐని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. గ్రహాంతర జీవాన్వేషణ చేసేందుకు ఆ టెలిస్కోప్‌ను స్టార్ట్ చేశారు. 2020లో రెండు సార్లు, 2022లో మరో సారి అనుమానిత సిగ్నల్ వచ్చాయని, ఆ డేటాను స్టడీ చేస్తున్నట్లు జాంగ్ వెల్లడించారు. ఏలియన్స్ అన్వేషణలో స్కై ఐ చాలా సున్నితంగా..కీలకంగా పనిచేయనున్నట్లు జాంగ్ తెలిపారు.
- Ocean of Storms: చంద్రుడిపై నీటి సంకేతాలు కనుగొన్న చైనీస్ సైంటిస్టులు
- Urea: అమెరికా నుంచి యూరియా దిగుమతులు పెంపు
- Water On Moon : చంద్రుడిపై నీళ్లున్నాయి..నిర్ధారించిన చైనా
- China-Africa : చీకటి ఖండంపై డ్రాగన్ కన్ను..ఆఫ్రికాను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాల్లో చైనా
- china: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఇద్దరు చైనీయుల అరెస్టు
1N.Chandrababu Naidu: ఆటో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదమన్న లోకేష్
2Jack Fruit : మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే పనస పండు!
3OTT Realeses : నిర్మాతలు ఫిక్స్.. 50 రోజుల తర్వాతే ఓటీటీకి..
4Mukesh Ambani : ముఖేశ్ అంబానీ వారసుల చేతుల్లోకి రిలయన్స్ సంస్థలు..RIL మరింత పరుగులు పెట్టబోతోందా ?
5CM JAGAN: ఆటో ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. పది లక్షల పరిహారం ప్రకటన
6Covid Cases: ఇండియాలో లక్ష దాటిన కరోనా కేసులు.. 110 దేశాల్లో విజృంభణ
7Shivani Rajashekar : చదువు కోసం మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకున్న శివాని రాజశేఖర్..
8Mukesh Ambani : ఆస్తులు పంచేస్తున్న ముకేశ్ అంబాని..మూడు సంస్థలుగా రిలయన్స్ వ్యాపారాల విభజన
9Telangana Food: బీజేపీ సభకోసం తెలంగాణ రుచులు.. స్పెషల్ ఐటమ్స్ చేయనున్న యాదమ్మ
10Handy Husband: మూడున్నర వేలకు భర్తను అద్దెకిస్తున్న భార్య
-
Aloo Bukhara : ఆలూ బుఖారాతో అనారోగ్యాలకు చెక్!
-
Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
-
Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
-
Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
-
TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్