నిజం ఒప్పుకున్న చైనా : అవును మా సైనికులు చనిపోయారు, కానీ..అంతమంది కాదు

నిజం ఒప్పుకున్న చైనా : అవును మా సైనికులు చనిపోయారు, కానీ..అంతమంది కాదు

Galwan clash : గాల్వాన్ ఘటనపై ఎనిమిది నెలల తర్వాత చైనా నిజం ఒప్పుకుంది. అసలు ఇప్పటిదాకా గాల్వాన్‌లో ఘర్షనే జరగలేదంటూ బుకాయిస్తూ వచ్చిన డ్రాగన్‌ ఎట్టకేలకు దిగొచ్చింది. గాల్వాన్ ఘటనలో తమ సైనికులు నలుగురు చనిపోయారంటూ అధికారికంగా ప్రకటించింది. వారి పేర్లను కూడా బయటపెట్టింది. ఈ ఘటనలో 45 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా ప్రకటించిన వారం రోజుల్లోనే చైనా ఈ విషయాన్ని బయటపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తూర్పు లద్దాఖ్‌లో గతేడాది భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 45మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయరని ప్రపంచ మీడియా ఏజెన్సీలు ఇన్నాళ్లు చెబుతువచ్చాయి. అయితే దీన్ని జిన్‌పింగ్ ప్రభుత్వం మాత్రం ఇప్పటిదాకా అంగీకరించలేదు. గతేడాది జూన్‌లోజరిగిన గాల్వాన్ ఘటనలో 20మంది భారత సైనికులు అమరులయ్యారు. అయితే ఆ ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు మరణించారన్న విషయాన్ని చైనా ప్రభుత్వం ఇప్పటి దాకా వెల్లడించలేదు.

వారం క్రితం ఈ విషయాన్ని రష్యా అధికార మీడియా ఏజెన్సీ టాస్‌ బయటపెట్టింది. గాల్వాన్‌ ఘటనలో 45మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. 20మంది భారత సైనికులు అమరులైనట్లు పేర్కొంది. వీటిపై అమెరికాతో పాటు అప్పట్లో వచ్చిన కొన్ని ఇంటిలిజెన్స్‌ నివేదికలను ఉటంకించింది. దీంతో ప్రపంచంలోని సూపర్‌ పవర్ దేశాలు ఇదే విషయాన్ని ధృవీకరిస్తుండడంతో చైనా వెనక్కి తగ్గింది. నిజాన్ని ఒప్పుకుంది. అయితే 45 మందికి బదులుగా నలుగురు చనిపోయరని ప్రకటించింది.