చైనీస్ యాప్స్ భారత్ బ్లాక్ చేసిందని.. ఆందోళనలో డ్రాగన్!

  • Published By: sreehari ,Published On : June 30, 2020 / 02:44 PM IST
చైనీస్ యాప్స్ భారత్ బ్లాక్ చేసిందని.. ఆందోళనలో డ్రాగన్!

డ్రాగన్ ఆగడాలకు భారత్ ముక్కుతాడు వేసింది. చైనాకు అతిపెద్ద ఆన్ లైన్ మార్కెట్ అయిన ఇండియా చైనీస్ యాప్స్ వినియోగంపై బ్లాక్ చేసింది. లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభనతో భారతదేశంలో యాంటీ చైనా సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. ప్రతిఒక్కరూ చైనా వస్తువులతో పాటు చైనీస్ యాప్స్ వినియోగాన్ని వ్యతిరికిస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా దేశంలో దాదాపు 59చైనీస్ యాప్స్ ను బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించింది.

భారత్ తమ దేశీయ ఆన్ లైన్ యాప్స్ బ్లాక్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చైనా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రముఖ చైనా సోషల్ పాపులర్ యాప్స్ టిక్‌టాక్, వీచాట్‌తో సహా 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం బ్లాక్ చేయడంతో ఆందోళన చెందుతున్నామని పేర్కొంది. అంతేకాదు.. ప్రస్తుత పరిస్థితిని కూడా ధృవీకరిస్తున్నామని చైనా తెలిపింది. ఈ విషయంలో చైనా తీవ్రంగా ఆందోళన చెందుతోందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి Zhao Lijian తెలిపారు. రాయిటర్స్ ప్రకారం.. చైనా వ్యాపారాల హక్కులను సమర్థించాల్సిన బాధ్యత భారత్‌కు ఉందని ఆయన అన్నారు.

Bytedance అనే చైనా కంపెనీ రూపొందించిన వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్, Tencent వీచాట్‌తో పాటు మరిన్ని చైనా యాప్స్ భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది. బ్లాక్ చేసిన యాప్స్ లో అలీబాబా యుసి బ్రౌజర్, షియోమి రెండు యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ భారత సార్వభౌమాధికారం, దేశ రక్షణ, రాష్ట్ర భద్రత, పబ్లిక్ ఆర్డర్’ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గూగుల్, ఆపిల్ ఈ యాప్‌లను ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి తొలగించాయి.
China Says "Strongly Concerned" After India Blocks Chinese Appsప్రభుత్వ ప్యానెల్ ముందు వివరణలు ఇవ్వడానికి కంపెనీలను ఆహ్వానించారు. ఇది నిషేధాన్ని తొలగించాలా? లేదా అని నిర్ణయిస్తుంది. ప్రభుత్వ ఉత్తర్వులను పాటించే ప్రక్రియలో టిక్ టాక్ ఉందని అంటోంది. భారత చట్టం ప్రకారం.. డేటా ప్రైవసీ, భద్రతా అవసరాలకు అనుగుణంగా కొనసాగుతోందని అన్నారు. భారత యూజర్ల సమాచారాన్ని చైనా ప్రభుత్వంతో సహా ఏ విదేశీ ప్రభుత్వంతోనూ షేర్ చేయలేదని, భవిష్యత్తులో అలా చేయమంటూ పేర్కొంది.

యూజర్ డేటా చోరీ, యూజర్ ప్రైవసీని ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. టిక్‌టాక్ యాప్‌లో భారత్‌ అతిపెద్ద మార్కెట్.. అందకే భారతదేశంలో 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని యాప్ కంపెనీ బైటెడాన్స్‌కు యోచిస్తోంది. ఈ నిషేధం పెద్ద అవరోధంగా భావిస్తోంది చైనా. జూన్ 15న లడఖ్‌లో జరిగిన ఘర్షణ నుంచి భారతదేశంలో చైనా వ్యతిరేక భావం చెలరేగుతోంది. ఇందులో 20 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. చైనా వ్యాపారాలను నిషేధించాలని పిలుపునిచ్చారు. దాదాపు 60 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను భారతదేశానికి ఎగుమతి చేస్తుందని తెలిపింది.

Read:భారత్ కంటే ముందే టిక్‌టాక్‌ను బ్యాన్ చేసిన దేశాలు ఇవే!